ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకురాలు హిల్లరీయే!

Update: 2016-08-04 06:49 GMT
ప్రాంతం ఏదైనా - ఏ దేశమైనా.. రాజకీయ  నాయకుడు అంటే ఇలానే మాట్లాడతారని - వారిలో కొంతమంది నోటికి అడ్డూ అదుపూ ఉండదని నిరూపించే  ప్రయత్న చేశాడు డొనాల్డ్ ట్రంప్.  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఏమాత్రం అడ్డూ అదుపూ లేని తన నోటిపై ఒక క్లారిటి వచ్చేసింది. అయితే ఈ సారి ఆక్లారిటీని మరింతగా బలపరిచేప్రయత్నం చేశారు ట్రంప్. రాజకీయాల్లో ప్రత్యర్ధి పై ఆరోపణలు చేయడం సర్వసాదారణమైన విషయం. అవి సంస్థాగతంగా ఉండక పోయినా పూర్తిగా వ్యక్తిగతంగా మాత్రం ఉండకూడదంటారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ - తన ప్రత్యర్ధి హిల్లరీని విమర్శించే విషయంలో అన్ని విషయాలు మరిచిపోతున్నారు. గతంలో ఒకసారి ఆమెను ఏకంగా దెయ్యం అని కూడా అనేశారు.

అక్కడితో ఆగని ట్రంప్ ఇంకా దారుణమైన ఆరోపణలు చేశారు. అందులో భాగంగా ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకురాలు హిల్లరీయేనని ఆయన ఆరోపించారు. దీనికోసం టెర్రరిస్టుల నుంచి ఆమెకు అవార్డు కూడా రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించిన ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే 9/11 దాడి జరిగేదే కాదని కూడా చెప్పుకొచ్చారు.

ఇస్లామిక్ స్టేట్ ఈ స్థాయికి రావడానికి అమెరికాయే కారణమని చెప్పిన ట్రంప్.. క్లింటన్ చేతిలో ఓడిపోవడం చాలా దారుణంగా ఉంటుందని తెలిపారు. ఈ స్థాయిలో ట్రంప్ అడ్డూ అదుపూలేకుండా పోవడాన్ని ప్రపంచ మీడియా ఏకి పారేస్తుంది. అగ్రరాజ్య నేతలంటే అందరికీ అన్నివిషయాల్లోనూ ఆదర్శంగా నిలవాలే తప్ప ఇలా చిల్లరగా ప్రవర్తించడమేమిటని కొందరు నేరుగానే విమర్శిస్తున్నారు. ఇంకా ట్రంప్ నోటి  నుండి ఎన్ని దారుణాలు వినాల్సి వస్తుందో మరి!!
Tags:    

Similar News