వామ్మో.. ట్రంప్ మరీ ఇంత లేటా..?

Update: 2017-03-28 04:34 GMT
తాజాగా చోటు చేసుకున్న ఘటన గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.  సుదీర్ఘంగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో యూపీలో సన్సేషన్ గెలుపు గెలిచిన మోడీ పార్టీకి.. ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు తాజాగా కంగ్రాట్స్ చెప్పారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మోడీ పార్టీ అద్భుత విజయం సాధించటం పట్ల శుభాకాంక్షలు చెప్పినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

యూపీ..ఉత్తరాఖండ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అద్భుత మెజార్టీతో గెలిచిందేమీ లేదు. ఆ మాటకు వస్తే.. ఉత్తరాఖండ్ గెలుపు కూడా పెద్ద ప్రత్యేకమైనదేమీ కాదు. ముందు నుంచి అనుకుంటున్నదే. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయం.. అది కూడా ఊహించని స్థాయిలో సీట్లను సంపాదించటం కీలకమైన అంశం.

సాధారణంగా ఏదైనా అనుకోని విజయం సాధించినప్పుడు వెనువెంటనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పటం కనిపిస్తుంది. మరి.. తన తీరుకు తగ్గట్లే.. గ్రీటింగ్స్ చెప్పే విషయంలో ట్రంప్ సైతం కాస్త చిత్రంగా రియాక్ట్ అవుతారా? అన్న సందేహం కలగటం ఖాయం. ఫలితాలు విడుదలై దాదాపు మూడు వారాలవుతున్న వేళ.. ఇప్పుడు ఫోన్ చేసి అభినందించటం ఏమిటో ట్రంప్ కే తెలియాలి. యూపీ.. ఉత్తరాఖండ్ మినహా మిగిలి రాష్ట్రాల్లో (పంజాబ్ ను మినహాయిస్తే) ప్రభుత్వ ఏర్పాటు ఎంత నాటకీయంగా జరిగాయో తెలిసిందే. వాస్తవం ఇలా ఉంటే.. ఐదు రాష్ట్రాల్లో ఘన విజయం (?) సాధించటం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేయటం ఏమిటో..?

మోడీకి ట్రంప్ ఫోన్ చేయటం కొత్తేమీ కాకున్నా.. భారత్ లో చోటు చేసుకున్నఅంతర్గత రాజకీయ అంశాల మీద అమెరికా అధ్యక్షుడు స్పందించటం.. అది కూడా మూడువారాల తర్వాత పోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెప్పటంపై ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News