అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేసేశారు. భారతీయులు సహా ప్రపంచంలోకి పలు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిఫర్డ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ అరైవల్ పథకాన్ని రద్దు చేశారు. తద్వారా సుమారు 7వేల మందికి పైగా భారతీయులను రోడ్డున పడేశారు. సరైన పత్రాలు లేకుండా చిన్నవయస్సులోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారికోసం ఐదేళ్ల క్రితం తాజా మాజీ అధ్యక్షుడు ఒబామా సర్కార్ ఈ ప్రవేశపెట్టింది. ఎన్నికల సమయంలోనే ఈ నిర్ణయాన్ని రద్దుచేస్తానని ప్రకటించిన ట్రంప్ అన్నంత పనిచేసేశారు.
బాల్యంలో అమెరికాలోకి ప్రవేశించిన ఆనాటి చిన్నారులు నేడు యువకులయ్యారు. వీరంతా 'డీఏసీఏ' పథకం కింద వర్క్ పర్మిట్లు పొందారు. ఈ పథకాన్ని మంగళవారం ట్రంప్ రద్దు చేశారు. ఈ విషయాన్ని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెసన్స్ మీడియాకు ప్రకటించారు. ఈ పథకంపై లాటిన్ అమెరికాకు చెందిన 8 లక్షల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పాటు 7వేల మంది భారతీయ అమెరికన్లపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్‌లో వైట్‌హౌస్ ముందు వందల సంఖ్యలో నిరసనకారులు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్ చర్యను డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ తప్పుపట్టారు.
అమెరికా వలస చట్టాల ప్రకారం సరైన పత్రాలు లేకుండా దేశంలో అక్రమంగా నివసిస్తున్న పిల్లల కోసం ఒబామా సర్కార్ చేసిన మంచి ఆలోచన 'డీఏసీఏ'. అలాంటి పిల్లలకు చదువుకునే హక్కు, యువకులుగా ఎదిగిన తర్వాత పనిచేసుకునే హక్కు (వర్క్ పర్మిట్)ను కల్పించిన కార్యక్రమమే 'డీఏసీఏ'. తాను అధ్యక్షుడ్ని అయితే దీనిని వెంటనే రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ గర్జించాడు. ఇది స్థానిక అమెరికన్లకు ఉపాధిని దూరం చేసిందని ట్రంప్ తెగ ప్రచారం చేశాడు. దీంతో రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 'డీఏసీఏ' కార్యక్రమంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. ``ఎన్నికల ప్రచారం సందర్భంగా వాగ్ధానం చేశారు. మరి ఇప్పుడు దీని సంగతేంటి' అని నేడు రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రా లు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి. అమెరికాలో ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నిరుద్యోగానికి 'వలస చట్టాల'కు సంబంధ ముందన్నది ట్రంప్ గట్టి నమ్మకం. స్థానిక అమెరికన్లకు ఉద్యోగాల లభ్యత పెరగటం కోసం వలస చట్టా లన్నింటినీ సమూలంగా మార్చేయాలన్న అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు. క్రమ క్రమంగా ఒక్కో దాన్ని నరుక్కుంటూ పోవాలన్న ప్రణాళికలో ట్రంప్ వర్గాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి.