డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా కన్నుమూత.. ట్రంప్ ఏమన్నాడంటే?

Update: 2022-07-15 08:30 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా మేరి ట్రంప్ న్యూయార్క్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఇవానా మరణంపై డొనాల్డ్ ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. ఇవానా అందమైన , అద్భుతమైన మహిళ అని.. స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు.

ఇవానా ట్రంప్ కు తన ముగ్గురు పిల్లలే  సంతోషం, గర్వమని ట్రంప్ పేర్కొన్నారు. తన పిల్లలను చూసి ఇవానా గర్వపడేదని.. తామూ ఆమె గురించి గర్వపడుతున్నామని తెలిపారు. ఇవానా ట్రంప్-డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారే ఇవాంక ట్రంప్, డొనాల్డ్ జూనియర్, ఎరిక్.

చెకోస్లోవేకియా సంతతికి చెందిన ఇవానా అమెరికాలో స్థిరపడ్డారు. మోడల్ గా కెరీర్ ను ఆరంభించారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ గా.. వ్యాపారవేత్తగా.. రచయిత్రిగా గుర్తింపు పొందారు.

1977లో డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంక పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరికి డొనాల్డ్ జూనియర్ జన్మించాడు. 1981లో ఇవాంకా, 1984లో ఎరిక్ జన్మించారు. డొనాల్డ్ ట్రంప్ మరియు ఇవానా వివాహం 14 సంవత్సరాలు నిలిచింది.. వారు 1976లో అప్పర్ ఈస్ట్ సైడ్ వాటర్ హోల్ వద్ద కలుసుకున్నారు.  1992లో మార్లా మాపుల్స్‌తో డోనాల్డ్‌ ట్రంప్ కు వివాహేతర సంబంధం గురించి వార్తల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.

తన తల్లి మరణానికి నివాళి అర్పించిన డొనాల్డ్ జూనియర్.. ఆమె ఒక అద్భుతమైన మహిళ అని అభివర్ణించారు. వ్యాపార రంగంలో ఆమె ఓ శక్తి అని.. వరల్డ్ క్లాస్ అథ్లెట్ అని.. పిల్లలను ప్రేమించే తల్లి అని పేర్కొన్నారు. ఆమెను తాము చాలా మిస్ అవుతామని వాపోయారు.

అప్పట్లో నటి మార్లా మ్యాపుల్స్ తో ట్రంప్ ఎఫైర్ ఇవానా  ట్రంప్ తో విడాకులకు కారణమైంది. 1990లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1993లో  ట్రంప్ మార్లా మ్యాపుల్స్ ను వివాహం చేసుకున్నారు. ఆమెతో విడాకుల తర్వాత 2005లో ట్రంప్ మెలానియాను వివాహం చేసుకున్నారు.
Tags:    

Similar News