అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపికైనప్పటి నుంచి ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ట్రంప్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ట్రంప్ కు షేక్ హ్యండ్ ఇచ్చేందుకు ఓ మహిళ నిరాకరించింది. అయితే, ఆ మహిళ ఓ దేశాధ్యక్షుడి భార్య కావడంతో ఈ షేక్ హ్యాండ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలెండ్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశాధ్యక్షుడి భార్య షాక్ ఇచ్చింది. ట్రంప్ తో కరచాలనం చేసేందుకు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్ర్ జెజ్ దువా సతీమణి కోర్న్ హౌజర్ దువా నిరాకరించింది. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కింది. దీంతో, ఆ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ట్రంప్, ఆయన భార్య మెలానియాలకు దువా జంట స్వాగతం పలుకుతున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.
మొదట పోలెండ్ ఆండ్ర్ జెజ్ కు షేక్ హ్యాండిచ్చిన ట్రంప్ - తర్వాత తన చేతిని హౌజర్ వైపు చాచారు. అయితే, హౌజర్ మాత్రం మెలానియా దగ్గరకు వెళ్లిపోయి కరచాలనం చేశారు. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ రీట్వీట్లు - లైక్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దుమారం రేపుతుండడంతో ఈ ఘటనపై ఆండ్ర్ జెజ్ స్పందించారు.
ట్రంప్ షేక్ హ్యాండ్ కోసం చేయి చాచిన విషయాన్ని తన సతీమణి గమనించలేదని ఆండ్ర్ జెజ్ చెప్పారు. ఇది చాలా చిన్న ఘటనని, దీనిపై సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయనవసరం లేదని అన్నారు. ఇటువంటి తప్పుడు వార్తలపై యుద్ధం చేయాలని వ్యాఖ్యానించారు.
Full View