ట్రంప్‌ వల్లే ప్ర‌పంచానికి అణు ముప్పు: నోబెల్‌ విజేత

Update: 2017-10-07 01:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దూకుడు గురించి శాస్త్రవేత్త‌లు సైతం ఆందోళ‌నలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న‌ వల్ల ప్రపంచానికి ముప్పు ఉందని నోబెల్‌ శాంతి బహుమతి గెలిచిన ఐసీఏఎన్‌ సంస్థ విశ్లేషించింది. అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆణ్వాయుధాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. ఇంటర్నేషనల్‌ క్యాంపేయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ సంస్థ డైరక్టర్‌ బీట్రైస్‌ ఫిన్‌ ఇవాళ జెనీవాలో మీడియాతో మాట్లాడారు. అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచిన తర్వాత చాలా మంది భయపడ్డారని, ఆయన అణ్వాయుధాలు వాడుతాడన్న వాస్తవనం అందరికీ తెలుసు అని ఐసీఏఎన్‌ డైరక్టర్‌ బీట్రైస్‌ తెలిపారు. నిపుణులు ఇచ్చే సూచనలను ట్రంప్‌ పట్టించుకోడు అని - అలాంటి ట్రాక్‌ రికార్డు ఆయనకు ఉందని బీట్రైస్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

అణ్వాయుధాల సమీకరణపై ట్రంప్‌ పెట్టిన దృష్టి కూడా అందర్నీ ఆకర్షించిందని ఇంటర్నేషనల్‌ క్యాంపేయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ సంస్థ డైరక్టర్‌ బీట్రైస్‌ ఫిన్‌ అన్నారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న అన్ని దేశాలు.. నిరాయుధీకరణకు కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. ఇవాళ నోబెల్‌ కమిటీ ఈ ఏడాది శాంతి బహుమతిని ప్రకటించింది. అణుబాంబులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్న ఐసీఏఎన్‌ సంస్థకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కడం విశేషం.

అణ్వాయుధాల నిర్మూలన కోసం పోరాటం చేస్తున్న ఐసీఏఎన్‌ సంస్థకు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. ఐసీఏఎన్‌ అంటే ఇంటర్నేషనల్‌ క్యాంపేన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌. అణ్వాయుధాలు వాడడం వల్ల మానవ జాతికి ప్రమాదం ఉందన్న ఉద్దేశాన్ని వివరిస్తూ ఐసీఏఎన్‌ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. మానవ హనన ఆయుధాలను నిషేధించాలని ఆ సంస్థ అనేక దేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐసీఏఎన్‌ ఓ ఎన్జీవో కూటమి. ఇందులో అనేక సంఘాలు ఉన్నాయి. సుమారు వంద దేశాలకు చెందిన సంస్థలు ఈ గ్రూపులో ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే.. న్యూక్లియర్‌ వెపన్స్‌ ను అదుపు చేయాలన్న సిద్ధాంతాలతో ఐసీఏఎన్‌ ఉద్యమం చేపడుతున్నది. ఇవాళ నోబెల్‌ కమిటీ.. ఐసీఏఎన్‌ కు శాంతి బహుమతిని ప్రకటించింది. అణ్వాయుధ దేశాలు అన్ని.. నిరాయుధీకరణకు సహకరించాలని నోబెల్‌ కమిటీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15వేల న్యూక్లియర్‌ వెపన్స్‌ ఉన్నాయి, ఆ ఆయుధాలను నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలు పనిచేయాలని నోబెల్‌ కమిటీ సూచించింది.
Tags:    

Similar News