ట్రంప్ ఆశలన్నీ హిందువులపైనేనా?

Update: 2016-11-07 04:12 GMT
మునుపెన్నడూలేనంత రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నీకలు జరుగుతున్న వేల... ప్రపంచం మొత్తం ఈ ఎన్నికలపై దృష్టిసారించింది. ఈ ఎన్నికల ఫలితాలపై అత్యంత ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, ఈ నెల 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట్లో ట్రంప్ చాలా వెనకబడ్డారని సర్వేలు చెప్పినా... ఎన్నికలు దగ్గరపడే టైం కి అనూహ్యంగా పుంజుకున్నారు. ఈ క్రమంలో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఇండియన్‌ అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకోవడానికి తన కొడుకును రంగంలోకి దింపారు.

ఈ క్రమంలో ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌.. ఫ్లోరిడాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించి, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి ముందుగా సూట్‌ వేసుకొని వచ్చిన ఎరిక్‌ (32) ఆలయం వద్ద మాత్రం భారతీయ సంప్రదాయ దుస్తులైన షెర్వాణీ ధరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హారతి ప్రాధాన్యం, హిందు సంప్రదాయాలు, ఆచార వ్య్వహారాల గురించి పూజారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎరిక్‌ కు కాషాయ ప్రతిమను ప్రధాన పూజారి బహూకరించారు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా కీలకంగా మారింది. ఫ్లోరిడాలో సంపన్న హిందూ జనాభా నానాటికీ పెరుగుతుండటంతో... ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్‌ హిందువులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. నరేంద్రమోడీ 2014 ఎన్నికల నినాదం ఆధారంగా "అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌" అంటూ టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. కాగా... దీపావళి రోజున కూడా ట్రంప్ కోడలు ఇలానే భారతీయ ఓటర్లతో మమేకమయ్యారు. వర్జీనియాలోని లాడన్ కౌంటీలోని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొని సందడి చేశారు. అనంతరం భారతీయులన్నా, భారతదేశమన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పిన సంగతి తెలిసిందే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News