అక్కడెక్కడో యుద్ధం జరిగితే అందులో అమెరికా సైనికులు ఎందుకు మరణించాలి.. ప్రపంచ శాంతి కోసం మనమెందుకు బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలి? అంటూ ఇంతవరకు మాటలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన వికృత యుద్ధ రూపాన్ని బయటపెట్టారు. ఈ రోజు ఉదయాన్నే సిరియాపై దండయాత్రకు దిగారు. సిరియాలో కొనసాగుతున్న రక్తపాతానికి అంతం పలకడానికి అంటూ పచ్చజెండా ఊపారు. దీంతో సిరియాపై అమెరికా క్షిపణి దాడులు మొదలయ్యాయి.
సిరియాలోని షైరత్ వైమానిక స్థావరంపై సుమారు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమెరికా తోమహాక్ క్షిపణులను సుమారు 80 వరకు ప్రయోగించింది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై సిరియా వైమానిక దళం పాల్పడిన రసాయన దాడులకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి చేసినట్లు అమెరికా చెబుతోంది. అంతేకాదు.. తమతో కలిసి రావాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. కానీ... అందెంతవరకు సాధ్యమన్నది అప్పుడే చెప్పలేని పరిస్థితి.
అయితే.... సిరియాలో ఆరేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతున్నా కూడా అక్కడ అమెరికా ప్రచ్ఛన్న పాత్ర పోషించడమే కానీ ఇంతవరకు డైరెక్టుగా ఎంటర్ కాలేదు. ప్రస్తుతం సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు రష్యా, ఇరాన్ ల నుంచి గట్టి మద్దతు ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులకు దిగడంతో రష్యా, ఇరాన్ లు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.
ప్రస్తుతం సిరియాలో రష్యాకు చెందిన వైమానిక, పదాతి దళాలు మోహరించి ఉన్నాయి. 2015 నుంచి అక్కడ కొనసాగుతున్న సున్నీ ముస్లిం రెబల్ గ్రూపులకు వ్యతిరేకంగా ఈ దళాలు అసద్ ప్రభుత్వానికి అండగా పోరాడుతున్నాయి. ఇప్పటివరకు ఉత్తర సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా పోరాటం చేస్తోంది. అక్కడున్న అరబ్, కుర్దిష్ సాయుధ దళాలకు అమెరికా ప్రత్యేక దళాలు మద్దతిస్తున్నాయి. తమ సైనిక స్థావరంపై అమెరికా తోమహాక్ క్షిపణులతో దాడి చేయడాన్ని సిరియా తీవ్రంగా ఖండించింది.
గోరుచుట్టుపై రోకటి పోటు..
సిరియా యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో ఆ దేశంలోని కీలక భాగాలు నాశనమయ్యాయి.దేశ జనాభాలో సగానికిపైగా జనాభా శరణార్ధులుగా పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. 2011 మార్చిలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నినాదాల నుంచి ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 90 వేల మందికి పైగా పౌరులు ఉన్నట్లు తెలిపింది. యుద్ధానికి ముందు 2.3 కోట్ల జనాభా కలిగిన సిరియాలో యుద్ధం కారణంగా సుమారు 50 లక్షల మంది వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉన్నవారిలోనూ 66 లక్షల జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
సిరియా నుంచి వలస వెళ్లిపోయినవారిలో ఎక్కువ మంది టర్కీకి వెళ్లిపోయారు. వీరి సంఖ్య 25 లక్షలకు పైగా ఉంటుంది. ఆ తర్వాత లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టులు శరణార్ధులకు ఆశ్రయం కల్పించాయి. అయితే, పెద్ద సంఖ్యలో శరణార్ధులు యూరప్ చేరుకోవడానికి సముద్రమార్గాన్ని ఎంచుకుని ప్రాణాలు కోల్పోయారు. యూరప్ చేరుకున్న కొంతమంది శరణార్ధులను అక్కడ అధికారులు జైళ్లలో బంధించి చిత్రవధ చేశారు. దాదాపు 17,700 మంది యూరప్ జైళ్లలో మరణించగా, వేల మంది జీహాదిస్టుల చెరలో ప్రాణాలు వదిలారని యూహెచ్ సీఆర్ చెప్పింది.
సిరియా యుద్ధం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయింది. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలకు గండి పడగా.. వసతులు, ఆరోగ్య, విద్యావ్యవస్ధలు సమూలంగా నాశనమయ్యాయి. సిరియాలో చాలా భాగం విద్యుత్తు సౌకర్యం పోయింది. 80శాతం జనాభా పేదరికంలో మగ్గుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/