ట్రంప్ సారుకు అప్పుడే విరక్తి వచ్చేసిందట..

Update: 2017-02-05 05:42 GMT
అనూహ్య పరిణామాలు - అనేక మలుపులు మధ్య అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి... తాను ఎన్నికలకు ముందు చెప్పినవన్నీ చేస్తూ అమెరికాను, ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ట్రంప్ మహానుభావుడికి తాజాగా పదవిపై విరక్తి వచ్చేసిందట. నిర్ణయాధికారం లేనప్పుడు ఈ పదవెందుకు అంటూ ఆయన నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. ఏడు దేశాలకు చెందినవారి విషయంలో ఇమ్మిగ్రేషన్ కు సంబంధించి ట్రంప్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకోడం.. దానిపై అక్కడి ఓ కోర్టు స్టే విధించడంతో ట్రంప్ ఇలా నిర్వేదానికి గురయ్యారట.
    
దేశంలోకి ఎవరు రావాలో, ఎవరు రాకూడదో నిర్ణయించే అధికారం లేనప్పుడు అధ్యక్ష పదవి ఎందుకని ఆయన అంటున్నారు.  ఇమిగ్రేషన్ విధానంపై తానిచ్చిన కార్యనిర్వాహక ఆదేశాలపై సియాటెల్ కోర్టు స్టే విధించడంపై ఆయన ఫైరవుతున్నారు.  కోర్టు ఆదేశాలు హాస్యాస్పదమని చెప్పిన ఆయన, పరిపాలనా వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఎందుకని ప్రశ్నించారు.
    
దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని న్యాయస్థానాలు సలహా ఇస్తున్నట్టుందని, కోర్టుల వైఖరితో ఇది చాలా పెద్ద సమస్యగా మారే ప్రమాదముందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతానికి కోర్టుల నిర్ణయాన్ని అమలు చేస్తామని, వీటిపై అపీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్నామని ట్రంప్ వర్గం వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ట్రంప్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్టపడడంతో ఆయన రగిలిపోతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News