అమెరికా అధ్యక్ష పదవి అంటే మాటలా? ప్రపంచాన్ని శాసించే సత్తా ఈ పదవి సొంతం. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు అధ్యక్షుడిగా కావటం అంటే.. ప్రపంచానికే అగ్రనేతగా అవతరించినట్లే. ట్రంప్ తీరు తెలిసిన వారు.. పరిచయం ఉన్న వారే కాదు.. ఆయన గురించి తెలుసుకునే వారు సైతం ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారన్న సందేహం కలుగుతుంది.
మాటల్లో టెంపరితనం.. నిర్ణయాల్లో తనకు తోచినట్లుగా.. అంతకు మించి నచ్చినట్లుగా తీసుకునే ఆయన మాటలు కూడా కరకుగానే ఉంటాయి. ఇక.. ప్రత్యర్థుల విషయంలో ఆయన తీరు మాములుగా ఉండదు. అధ్యక్ష ఎన్నికల వేళలో ఆయన్ను విభేదించిన నేతలు మాత్రమే కాదు.. మీడియా సంస్థలు సైతం ఎన్ని కష్టాలు పడుతున్నాయో ఇప్పడదరికి సుపరిచితమే.
అలాంటి ట్రంప్ మాష్టారు మరోసారి తాత అయ్యారు. ప్రపంచాన్ని ఏలే తాతకు మనమరాలిగా ఈ భూమి మీదకు వచ్చింది. ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ సతీమణి లారా ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆనంద విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాతో ప్రపంచానికి తెలియజేశారు. ఈ ప్రపంచంలోకి కరోలినా డొరొతీ ట్రంప్ ను ఆహ్వానిస్తున్నామన్నారు.
ట్రంప్ కుటుంబం కాస్త పెద్దదే. ఆయనకు మొత్తం ముగ్గురు భార్యలు. ఇద్దరికి అలెడ్రి విడాకులు ఇచ్చేశారు. మొత్తం ముగ్గురు భార్యలతో ఆయనకు సంతానం ఐదుగురు. వారిలో పెద్ద వాళ్లైన డొనాల్డ్ జూనియర్ కు ఐదుగురు.. ఇవాంకా ట్రంప్ నకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక.. ట్రంప్ వ్యాపార వ్యవహారాల్ని చూసుకునే ఎరిక్ కు ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు. తాజాగా పుట్టిన బుజ్జిదానితో కలిసి ట్రంప్ నకు మొత్తం మనవళ్లు.. మనమరాళ్లు పది మంది అయినట్లు. మొత్తంగా చూస్తే.. ట్రంప్ ది పెద్ద కుటుంబమే సుమా.