అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన మాటలతో ప్రపంచానికి బాగా పరిచయం అయ్యారు. అంతకముందు వ్యాపారవేత్తగా - టెలివిజన్ ప్రొడ్యూసర్ గా - అమెరికా వాసులకు ట్రంప్ సుపరిచితుడే! అయితే ఇన్నాళ్లూ తన మాటలతో సంచలనాలు సృష్టించిన ట్రంప్ - ఆయన వినియోగిస్తున్న ప్రత్యేక విమానం విషయంలో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ఉన్న ట్రంప్... దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించిన విమానాన్ని అమెరికా అధ్యక్షుడి విమానమైన "ఎయిర్ ఫోర్స్ వన్"తో పోలుస్తున్నారట అక్కడివాసులు. అంటే... ట్రంప్ విమానం ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకొవచ్చు. అయితే... ఈ విమానాన్ని (బోయింగ్ 757) మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్లెస్ నుంచి ట్రంప్ కోనుగోలు చేశాడు. అనంతరం తన అభిరుచికి తగినట్టుగా దాన్ని డిజైన్ చేయించాడు. ఈ విమానంలో ఉన్న హంగూ ఆర్భాటాలు - హడావిడీ చూసినవారంతా దీనికి "ట్రంప్ ఫోర్స్ వన్" అని పిలుస్తున్నారు. ఈ ప్రత్యేక విమానంలో సమావేశ మందిరాలు - బెడ్ రూమ్ - బాత్రూమ్ లతో పాటు లగ్జరీ సీట్లతో సకల సదుపాయాలు అమర్చాడు. ఆ విమానంలో సీటు బెల్టులకు - బాత్రూం కుళాయిలకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారుపూత ఉంటుందంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆ విమానంలోపలున్న హడావిడిని. అయితే... ఎయిర్ ఫోర్స్ వన్ గా పిలిచే అమెరికా అధ్యక్షుడి విమానం విలువ 325 మిలియన్ డాలర్లు కాగా - ట్రంప్ ఉపయోగిస్తున్న విమానం విలువ 100 మిలియన్ డాలర్లు. దీంతో ఈ రెండు విమానాలలో ఉన్న సదుపాయాలపై ఆసక్తి పెరిగింది. ఆ విషయాలు కొన్ని ఇప్పుడు చూద్దాం...
ఈ విమానంలో అధికారిక మీడియా సమావేశాలు జరుగడానికి "స్టాఫ్ అండ్ ప్రెస్ క్యార్టర్స్" ఏర్పాటు ఉంది. అలాగే సీనియర్ అధికారులతో చర్చల కోసం ఉపయోగించే సమావేశ మందిరం సీనియర్ స్టాఫ్ మీటింగ్ రూమ్ కూడా వేరుగా ఉంటుంది. ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ టీమ్ అధ్యక్షుడికి నిత్యం అందుబాటులో ఉంటారు. అలాగే అతిథులతో సమావేశాల కోసం గెస్ట్ సెక్షన్ - ఆఫీస్ స్టాఫ్ కి స్పెషల్ ప్లేస్ ఉన్నాయి.
అలాగే డైనింగ్ రూమ్ లోనే కిచెన్ ప్రత్యేకంగా ఉంటుంది. అత్యవసర ఆదేశాలు - ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు నియమించిన స్టాఫ్ కోసం కమ్యూనికేషన్ రూమ్ ఉంటుంది. దీంట్లో సుమారు 85 టెలీఫోన్స్ - 19 టీవీలు - ఫ్యాక్స్ మెషీన్ లు ఉంటాయి. అలాగే డ్రెస్సింగ్ రూమ్ - షవర్ లతో పాటు జిమ్ కూడా ఉంటుంది. అలాగే బ్లడ్ బ్యాంకుతో పాటు - అత్యవసర చికిత్సకు అవసరమైన సకల పరికరాలు అందులోనే ఉంటాయి.
ఇక రక్షణ విషయానికొస్తే... శత్రు విపణులను మిస్ గైడ్ చేయడానికి ఉపయోగపడే చాఫ్ అండ్ ఫ్లేర్స్ ఈ విమానంలో ఉంటాయి. అలాగే దీంట్లో ఉన్న ఈసీఎమ్ ద్వారా శత్రువుల రాడార్ లను జామ్ చేయవచ్చు. ఇదే సమయంలో క్షిపణుల దాడిని కూడా ఎదుర్కొనే శక్తిని ఇది కలిగి ఉంటుంది. ఇక ఈ విమానంలోని ప్రతి కిటికీ బుల్లెట్ - బాంబు ప్రూఫ్ లతో నిర్మితమైంది. మరో ప్రత్యేకత ఏమిటంటే... ఈ విమానంలో కూర్చునే న్యూక్లియర్ అటాక్ చేసే సదుపాయం కూడా ఉంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/