ట్రంప్ ఎఫెక్ట్ః రోడ్డున ప‌డేది 7 కాదు 20 వేలు

Update: 2017-09-07 06:00 GMT
బాల్యంలో తల్లిదండ్రుల వెంట వచ్చిన కాందిశీకుల (డ్రీమర్స్)ను వెనక్కి పంపాలన్నఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం భారతీయ అమెరికన్లపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సుమారు 8లక్షల మంది స్వాప్నికుల (డ్రీమర్ల) వర్క్ పర్మిట్లను రద్దు చేస్తూ అమెరికా ర‌థ‌సార‌థి త‌సీఉకున్న నిర్ణ‌యంపై ఇప్ప‌టికే గ‌గ్గోలు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మొత్తం సంఖ్య‌లో సుమారు ఏడు వేలమంది భారతీయ అమెరికన్లేనని అధికారిక గణాంకాలు వెలువ‌డ్డ‌ప్ప‌టికీ వారి సంఖ్య 20వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

చిన్న‌త‌నంలో వ‌ల‌స వ‌చ్చి త‌దుప‌రి వ‌ర్క్ ప‌ర్మిట్ పొందిన వారిపై తాజా నిర్ణ‌యం భారీ స్థాయిలోనే ప్ర‌భావం చూప‌నుందని సౌత్‌ ఏషియా అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) అనే సంస్థ తెలిపింది. ట్రంప్ తీసుకున్నీ షాకింగ్ నిర్ణ‌యం వ‌ల్ల అంచ‌నాల‌కు మించి డ్రీమ‌ర్స్ రోడ్డున ప‌డిపోనున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌తీయుల సంఖ్య‌ను 7వేలుగా చెప్తున్న‌ప్ప‌టికీ అధికారిక లెక్క‌ల కంటే వారి సంఖ్య అధికంగా ఉంటుంద‌ని పేర్కొంది. తాము వివిధ రూపాల్లో సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం ఈ సంఖ్య 20 వేల‌కు పైగా ఉంటుంద‌ని సౌత్‌ ఏషియా అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) తెలిపింది.

మ‌రోవైపు ట్రంప్‌ నిర్ణయం క్రూరమైందని, ఇది స్వయంగా ఓటమిని అంగీకరించడమే అవుతుందని తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్‌ ఒబామా తెలిపారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్‌ (డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌ హుడ్‌ అరైవల్స్‌- డీఏసీఏ) వర్క్‌ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయమని విమర్శించారు. డ్రీమర్స్‌ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్‌ సంతకం చేసిన రోజే ట్రంప్‌ చర్యను ఒబామా తప్పుపట్టారు. వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమే మీలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో ఒబామా పేర్కొన్నారు. పేరెంట్స్‌ అమెరికాకు రావడమే డ్రీమర్స్‌ చేసిన తప్పిదం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.

ఇదిలాఉండగా... డాకా (డీఏసీఏ) రద్దుతో కాందిశీకులుగా మారనున్న లక్షలాదిమంది ఉద్యోగులకు టెక్నాలజీ దిగ్గజ సంస్థలు అండగా నిలిచాయి. డ్రీమర్ల క్షమాభిక్షను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయాన్ని ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌ బర్గ్ - యాపిల్ సీఈవో టిమ్ కుక్ - మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల - గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డాకా రద్దుతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని 300మంది టెక్ - బిజినెస్ దిగ్గజాలు అధ్యక్షుడు ట్రంప్‌ కు లేఖ రాశారు.
Tags:    

Similar News