‘ఆస్కార్‌’ను ఎటకారం ఆడేసిన ట్రంప్

Update: 2017-02-28 08:45 GMT
ట్రంప్ నోరు ఎలాంటిదో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన నోటికి బాధితులుగా మారిన వారెందరో. తాజాగా ఆ జాబితాలోకి అస్కార్ కూడా చేరిపోయింది. ప్రపంచ సినిమాకు పండగ లాంటి అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా.. పలువురు సినీ ప్రముఖులు ట్రంప్ తీరుకు నిరసనగా బ్లూ రిబ్బన్ ను ధరించటమే కాదు.. ట్రంప్ పై తమకున్న వ్యతిరేకతను అస్సలు దాచుకోలేదు.

వేదిక మీదన.. ట్రంప్ తీరును తప్పు పట్టిన ప్రముఖులకు కొదవలేదు. ఇలాంటి విషయాలకు వెనువెంటనే స్పందించే ట్రంప్.. అస్కార్ వేడుకల్ని తనదైన శైలిలో ఎటకారం ఆడేశారు. అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఉత్తమ చిత్రం విజేతను ప్రకటించే విషయంలో చోటు చేసుకున్న గందరగోళాన్ని ప్రస్తావిస్తూ.. అస్కార్ వేడుకల నిర్వాహకులపై వాగ్బాణాల్ని సంధించారు.

వైట్ హౌస్ లోని ఓవెల్ ఆఫీసులో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. అస్కార్ నిర్వాహకులు తమ కార్యక్రమం మీద కంటే కూడా రాజకీయాల మీద విపరీతంగా దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఈ కారణంతోనే అస్కార్ వన్నె కోల్పోవటం విషాదంగా అభివర్ణించారు. గతంలో తానూ అస్కార్ వేడుకులకు వెళ్లానని.. ఈసారి అందులోని ప్రత్యేకత ఏదో మిస్ అయ్యిందని.. ముగింపు (ఉత్తమ చిత్ర విజేతను ప్రకటించే విషయంలో ఒక పేరుకు బదులుగా మరో పేరు ప్రకటించటం.. ఆ తర్వాత సర్దుకొని అంతిమంగా మూన్ లైట్ ను విజేతగా ప్రకటించారు) ఒక విషాదంగా  అభివర్ణించారు.

అస్కార్ వేడుకల సందర్భంగా వ్యాఖ్యత జిమ్మీ కిమ్మెల్ వేదిక మీద నుంచే ట్రంప్ మీద సటైర్లు వేయటమే కాదు.. ట్రంప్ ఇంకా ట్వీట్ చేయలేదంటూ వేదిక మీద నుంచే ట్వీట్ చేయటం.. కెమేరాను తన ఫోన్ మీదకు జూమ్ చేయాలని కోరి మరీ ట్రంప్ ను టచ్ చేయగా.. ఆయన కోరుకున్నట్లు ట్వీట్ రూపంలో కాకుండా ఇంటర్వ్యూ రూపంలో తన రియాక్షన్ ను ట్రంప్ వెలుబుచ్చటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News