అగ్రరాజ్యం అమెరికా మాజీ అధినేత డోనాల్డ్ ట్రంప్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన అధ్యక్షడిగా కొనసాగినంత కాలం కూడా పలు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో సార్లు వార్తల్లోకి ఎక్కారు. అయన అధినేతగా ప్రమాణస్వీకారం చేసిన సమయం నుండి వైట్ హౌస్ నుండి బయటకి వచ్చేవరకు అన్ని వివాదాలే. చివరి ఎన్నికల్లో ఓడిపోయినా కూడా దాన్ని కూడా అయన గౌరవంగా స్వీకరించలేకపోయారు. అయితే అయన క్రేజ్ మాత్రం ఎన్నడూ తగ్గలేదు. ఇటీవల కాలంలో ఆయన పేరుతో చేస్తున్న మీమ్స్, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా చైనాకు చెందిన ఓ వ్యాపారి వినూత్న ఆలోచన చేశారు. ఎప్పుడూ చిటపటలాడుతూ , ఫైర్ అవుతూ , చిలిపిచేష్టలుతో ఆకట్టుకున్న ట్రంప్ ఒక్కసారిగా బుద్ధునిగా మార్చేశారు. అరె చైనా వ్యాపారి ఏంటి , ట్రంప్ ను మార్చేయడం ఏంటి అని అనుకుంటున్నారా, బుద్ధుని రూపంలో ఉన్న ట్రంప్ విగ్రహాన్ని తయారు చేసి ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెట్టాడు. తెలుపు రంగులో ఉండి., చాలా ప్రశాంతంతో కూర్చుని ఉన్న ట్రంప్ విగ్రహం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చైనా ఈ కామర్స్ సైట్ తబావోలో ఉంచగా 4.6మీటర్ల భారీ విగ్రహం ధర రూ 44707 కాగా, చిన్న సైజులో 1.6 మీటర్ల విగ్రహం రూ 11,168 పలికింది.
ట్రంప్ ప్రవచించిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదం స్ఫూర్తితో మేక్ యువర్ కంపెనీ గ్రేట్ ఎగైన్ అనే సందేశాన్ని ఇస్తూ తాను ఈ ఉత్పత్తిని రూపొందించానని ఫుజియన్ ప్రావియన్స్ కు చెందిన సెల్లర్ చైనా అధికార వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ కు తెలిపారు. వినోదం కోసం ప్రజలు ట్రంప్ విగ్రహాన్ని కొనుగోలు చేస్తున్నారని తాను మొత్తం వంద విగ్రహాలు తయారుచేయగా ఇప్పటికే పలు విగ్రహాలు అమ్ముడుపోయాయని చెప్పారు. ఏదేమైనా ట్రంప్ ను ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ చూడలేదు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.