మొనగాళ్లు లాంటి సీఈవోలకు వార్నింగ్ తప్పలేదు

Update: 2017-01-24 16:55 GMT
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే.. తాను అనుకున్న పనుల్ని ఒకటి తర్వాత ఒకటిగా చేసుకుంటూ పోతున్నారు డోనాల్డ్ ట్రంప్. తాను కానీ అమెరికా అధ్యక్షుడ్ని అయితే ఏం చేస్తానో.. ఎన్నికల ప్రచారం నుంచి చెప్పుకొచ్చిన ఆయన.. అధ్యక్ష కుర్చీలో కూర్చున్న నాటి నుంచి తానేం చేయాలనుకున్న విషయాలపై ఎలాంటి ఆలస్యం చేయకుండా పరుగులు తీస్తుండటం గమనార్హం

అమెరికాలోని డజను మంది టాప్ బిజినెస్ లీడర్లతో వైట్ హౌస్ లోని బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ను నిర్వహించిన ట్రంప్.. వారు ఊహించని రీతిలో వార్నింగ్ ఇచ్చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ కు.. వ్యాపార దిగ్గజాల్ని ఎలా డీల్ చేయాలో బాగా తెలియటంతో.. సూటిగా వారిని ఎక్కడ.. ఏ విషయం మీద టచ్ చేయాలో సరిగ్గా అక్కడే టచ్ చేశారు. అమెరికన్ కంపెనీలు కానీ తమ ఉద్యోగాల్ని విదేశాలకు తరలించాలనుకుంటే.. భారీ మొత్తంతో సరిహద్దు పన్నులు కట్టాల్సిందేనని వారికి స్పష్టం చేశారు.

అదే సమయంలో.. అమెరికన్లకు ఉద్యోగాల్ని కల్పించిన పక్షంలో భారీ మొత్తంలో పన్ను కోత ఉంటుందని.. రూల్స్ ను రిలాక్సేషన్ చేయనున్నట్లుగా ప్రకటించారు. వస్తు తయారీ రంగం అనేది అమెరికా స్వాధీనంలోకి తెచ్చుకోవాలని వ్యాపార దిగ్గజాలకు తేల్చి చెప్పిన ట్రంప్.. ఒక వేళ వేరే దేశంలో ఫ్యాక్టరీల్ని ఏర్పాటు చేసి.. అమెరికాలోకి ఉత్పత్తుల్నితరలించాలంటే కుదరదని.. భారీగా సరిహద్దు ట్యాక్స్ ల్ని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో.. తయారీ రంగాన్ని అమెరికాలో విపరీతంగా పెంచటంతోపాటు.. అమెరికన్ కంపెనీలు వేరే చోట్ల కంపెనీలు పెట్టి.. వస్తువుల్ని అమెరికాలోకి వచ్చేలా చేస్తున్న పాలసీని పూర్తిగా మార్చాలన్న కంకణం కట్టుకున్నట్లగా ట్రంప్ తీరు ఉందని చెబుతున్నారు.

తానేం చేయబోతున్నాన్నది చైనాతో సహా అనేక దేశాలకు నమ్మశక్యంగా ఉండబోదన్న ఆయన.. అమెరికన్ కంపెనీలేవీ బయట దేశాలకు తరలించటం కుదరదని తేల్చేశారు. మధ్యతరగతి ప్రజల కోసం.. సంస్థల కోసం15 శాతం నుంచి 35 శాతం వరకు పన్నులు తగ్గిస్తామని వెల్లడించిన ట్రంప్.. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తీసి వేయకుండా ఉండటమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.  అదికారం చేపట్టిన ఇంత స్వల్ప వ్యవధిలోనే టాప్ బిజినెస్ సీఈవోలకు తనదైన రీతిలో షాక్ ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో ట్రంప్ దూకుడు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News