ట్రంప్ వైఫ్ అక్క‌డ‌లా ఇరుక్కుపోయార‌ట‌

Update: 2017-07-07 16:43 GMT
ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికాకు అధ్య‌క్షుడంటే మామూలు కాదు. ఆ ప‌వ‌ర్ ఫుల్ కుర్చీలో ట్రంప్ లాంటి వ్య‌క్తి కూర్చుంటే వార్త‌ల‌కు కొద‌వ ఉండ‌దు. త‌న వైఖ‌రితో ప్ర‌పంచమంతా త‌న‌కు వ్య‌తిరేకంగా చేసుకోవ‌టం ట్రంప్‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. మ‌రి.. ఇలాంటి వ్య‌క్తి స‌తీమ‌ణి అంటే ఎలా ఉంటార‌ని అనుకున్నా.. మెలానియా మాత్రం త‌న తీరుతో ఇప్ప‌టికే పెద్ద ఎత్తున మ‌న‌సుల్ని దోచేశారు.

పొందిగ్గా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎక్క‌డా ఎక్కువ‌.. త‌క్కువ‌ చేయ‌కుండా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అప్పుడ‌ప్పుడు తెంప‌రి ట్రంప్ ప‌ట్ల కాస్తంత క‌రుకుగా వ్య‌వ‌హ‌రిస్తూ మీడియాలో హ‌డావుడి అవుతున్నా.. ఆమె తీరును మాత్రం ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌ని రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. త‌న వ్య‌వ‌హార‌శైలితో ఇప్ప‌టికే పాజిటివ్ లుక్స్ లోకి వెళ్లిపోయిన ఆమెకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి ఇప్పుడు హ‌డావుడి చేస్తోంది.

బ్రిక్స్ తాజా స‌ద‌స్సు జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్ లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. జీ 20 శిఖ‌రాగ్ర స‌మావేశానికి అతిర‌థ మ‌హార‌థుల్లాంటి నేత‌లు పాల్గాన్నారు. దేశాధినేత‌లంతా స‌ద‌స్సులో బిజీగా ఉంటే.. వారి స‌తీమ‌ణులు అతిధి గృహంలో ఇరుక్కుపోయారు. అలాంటి వారిలో ట్రంప్ స‌తీమ‌ణి కూడా ఉన్నారు. ఎందుకిలా అంటే.. జీ 20 స‌ద‌స్సును వ్య‌తిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి వేళ‌.. అమెరికా అధ్య‌క్షుడి స‌తీమ‌ణి బ‌య‌ట‌కు వెళితే భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం ఉంటుంది. అందుకే.. ఆమెను బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా అతిధి గృహంలోనే ఉండిపోవాల‌ని భ‌ద్ర‌తా సిబ్బంది కోరార‌ట‌. దీంతో.. గెస్ట్ రూంలోనే మెలానియా ఇరుక్కుపోవాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అయితే.. ఆమెతో పాటు మిగిలిన దేశాధినేతల స‌తీమ‌ణులు కూడా ఉండ‌టంతో మెలానియాకు బోర్ కొట్ట‌ద‌ని చెప్పక త‌ప్ప‌దు.
Tags:    

Similar News