డోనాల్డ్ ట్రంప్ సాధించాడు

Update: 2016-12-20 09:26 GMT
అమెరికా అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక‌లో కీల‌క ద‌శ పూర్త‌యింద‌ని చెప్పాలి. ఎల‌క్టోర‌ల్ కాలేజ్ కూడా ఆయ‌న్ని అధ్య‌క్షుడిగా ఎన్నుకోవ‌డంతో... అగ్ర‌రాజ్య అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లోని కీల‌క అంకం ముగిసింది. అమెరికా 45వ దేశాధ్య‌క్షుడిగా డోన‌ల్డ్ ట్రంప్ విజ‌యం సాధించారు. ఎలక్టోర‌ల్ కాలేజ్ కూడా ఆయ‌న్ని ఎన్నుకున్న నేప‌థ్యంలో ట్రంప్ ట్వీట్ చేశారు. ‘వియ్ డిడ్ ఇట్‌’ అంటూ త‌న‌ను ఎన్నుకున్న ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. త‌న విజయాన్ని అడ్డుకోవ‌డం కోసం చాలా శ‌క్తులు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించాయ‌నీ, మీడియా కూడా ఉద్దేశ‌పూర్వ‌కంగా అసత్య ప్ర‌చారం చేసిందనీ అయినా స‌రే త‌న విజాయ‌న్ని ఎవ్వ‌రూ అడ్డుకోలేక‌పోయార‌ని ట్రంప్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. సో... దీంతో ఎల‌క్టోర‌ల్ కాలేజ్ స‌భ్యులు కూడా అధ్య‌క్షుడిని ఎన్నుకోవ‌డం పూర్త‌యింది.

నిజానికి, అధ్య‌క్ష ఎన్నిక‌లు గ‌త నెల‌లోనే జ‌రిగిపోయాయి. ప్ర‌జ‌లు ఓట్లు వేసి ట్రంప్‌ను ఎన్నుకున్నారు. అయితే, అక్క‌డితో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిన‌ట్టు కాదు. అక్క‌డి రాజ్యాంగం ప్ర‌కారం పాటించాల్సిన ఆన‌వాయితీలు కొన్ని ఉన్నాయి. మొత్తంగా 538 మంది ఎల‌క్టోర‌ల్ స‌భ్యులు కూడా అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరంతా 48 రాష్ట్రాలూ రాజ‌ధాని ప్రాంతం నుంచి ఎన్నికైన‌వారు. వీరంద‌రూ ఆయా రాష్ట్రాల్లోని రాజ‌ధాని నుంచే అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో... ఆ ప్ర‌క్రియ ప్రకారం జ‌రిగిన ఈ ఎన్నిక‌లో కూడా మెజారిటీ స‌భ్యులు ట్రంప్‌ను అధ్యక్షుడిగా కోరుకున్నారు.

ఈ ఎల‌క్టోర‌ల్ స‌భ్యుల‌ను ప్ర‌ధాన పార్టీలే ఎన్నిక‌ల‌కు ముందుకు ఎంపిక చేస్తాయి. సాధార‌ణంగా వీరంతా ఆయా పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కే ఓట్లు వేస్తారు. అలా ఓటు వేస్తామ‌ని ముందుగా ప్ర‌మాణం చేయాల్సి ఉంటుంది. అలా క‌చ్చితంగా ఓటు వేయాల‌ని కొన్ని రాష్ట్రాలు చెబుతాయి. అయితే, ఒక‌సారి అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఈ ఎల‌క్టోర‌ల్ స‌భ్యులు ఓటు వేయ‌గానే వారి స‌భ్య‌త్వం దానంత‌ట అదే పూర్త‌యిన‌ట్టు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News