కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి.. ప్రపంచాన్ని అతలాకుతలం చేయటం గతంలో సినిమాల్లో చూసి ఉంటాం. కొవిడ్ పుణ్యమా అని ఆ కొరత తీరిపోయింది. దీనికి కారణం.. చైనా దుర్మార్గమేనన్నమాట ప్రపంచవ్యాప్తంగా అందరు విశ్వసిస్తున్నా.. డ్రాగన్ దేశం మాత్రం తనదైన తొండి మాటల్ని చెబుతోంది. కరోనా మూలాలు.. దానికి కారణాల గురించి ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వని ఆ దేశం.. అగ్రరాజ్యమైన అమెరికా చేస్తున్న ప్రకటనల్ని మాత్రం ఖండిస్తోంది. రాజకీయంగా తమను దెబ్బ తీయటానికి చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణిస్తోంది.
ఒకవేళ నిజంగానే అమెరికా అలానే చేసిందనుకుందాం. అలాంటివేళ.. తన నిజాయితీని నిరూపించుకోవటానికి తానే దేశాల వారీగా కొందరు ప్రముఖుల్ని తమ దేశాని రావాలని ఆహ్వానించి.. వారికి అవసరమైన సమాచారాన్ని ఇస్తే సరిపోతుంది కదా? ఇదేమీ కాదంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల వారు తమ దేశం నుంచి తమకు తోచిన నిపుణులను జట్టుగా పంపిస్తే.. వారికి సమాచారం ఇవ్వటం ద్వారా.. తామెంత నిజాయితీగా ఉన్నామన్న విషయాన్ని చాటేలా వ్యవహరించొచ్చు కదా?
ఇదేమీ చేయకుండా.. తాను చేసిన వెధవ పనిని సమర్థించుకుంటూ.. తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ వ్యవహరిస్తున్న తీరు అందరికి తెలిసిందే. కొవిడ్ మూలాలపై 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిఘా విభాగాన్ని ఆదేశించటం తెలిసిందే. ఆయన ఆదేశాల నేపథ్యంలో అమెరికా నిఘా విభాగం రెండు నెలల క్రితం ఒక నివేదికను తయారుచేసింది. కొవిడ్ మూలాలపై కొత్తగా ఎటువంటి సమాచారం లేనందున.. కచ్ఛితంగా ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు పేర్కొంది.
అన్నింటికి మించి జంతువుల నుంచి మనషులకు సోకిందా? లేదంటే ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందా? అన్న విషయంపై స్పష్టత రాలేదని చెప్పింది. తుది నిర్ణయానికి రావాలంటే చైనా మరింత సహకారం అందించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం మీద దర్యాప్తును వ్యతిరేకిస్తున్న చైనా.. కొవిడ్ మూలాలపై అంతర్జాతీయ బ్రందం దర్యాప్తు జరపటాన్ని తప్పు పడుతోంది. తమపై దాడులు చేయటాన్ని మానుకోవాలంటూ అమెరికాకు హితవు పలుకుతోంది. తాను చేసిన తప్పును కప్పి పుచ్చుకోవటం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఆధారాలు లేకున్నా.. యావత్ ప్రపంచం మాత్రం వారి దుర్మార్గాన్ని ఇప్పటికే గుర్తించిందని చెప్పాలి.