కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. ఈ లాక్ డౌన్ వల్ల దేశంలో జన జీవనం పూర్తిగా స్తంభించింది. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలను కూడా మూసేసారు. దీనితో మందుబాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. చాలాచోట్ల చాలామంది మధ్య దొరక్క పిచ్చివారిలా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది మద్యం అనుకోని ఏవేవో ద్రావణాలు తాగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మద్యం షాపులను తెరవాలని రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ పూర్ స్పష్టం చేశారు. వైరస్ క్రిములను నిర్మూలించేందుకు ఆల్కహాల్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గొంతులో తిష్టవేసే.. వైరస్ క్రిముల్ని చంపేందుకు మద్య వాడొచ్చుకదా అని అయన అభిప్రాయపడ్డారు. ఈమేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాసి మద్యం దుకాణాలను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇక, దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే, మద్యం షాపులను మూసేయడంతో.. మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అయన తన లేఖలో ప్రస్తావించారు. మద్యం అమ్ముతూ స్వయం ఉపాధి పొందే వారికి, ప్రభుత్వానికి ఇదొక ఒక మంచి అవకాశం. మార్కెట్ లో మద్యానికి చాలా డిమాండ్ ఉంది. లాక్ డౌన్ నిషేధ సమయంలో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. మద్యానికి బానిసైనవారి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతించదు. అందువల్ల దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది అని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు.