మత్తు.. కొత్త పుంతలు తొక్కుతోంది. మద్యం మామూలైపోయింది.. గంజాయి పాతదైపోయింది.. దీంతో డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది! విశాఖపట్నంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు సాక్ష్యం. మెడికల్ మాటున ఓ వ్యక్తి సరఫరా చేస్తున్న మత్తు ఇంజక్షన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
విశాఖలోని వడ్లపూడి గాంధీబొమ్మ సెంటర్లో తనిఖీలు చేస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. నక్కా మహేష్ అనే సదరు వ్యక్తిని ఆపి, తనిఖీ చేయగా.. అతని వద్ద భారీ స్థాయిలో మత్తు ఇంజక్షన్లు బయటపడ్డాయి. అవి ఒకటీ రెండు కాదు.. దాదాపు 1500 వరకు ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాత నేరస్థుడు. అతన్ని అదుపులోకి విచారించగా.. ఆ మత్తు ఇంజక్షన్లను పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్డర్ చేసినట్లు వెల్లడించాడు. ఫేక్ అడ్రస్‌లతో ఇంజక్షన్లు ఆర్డర్ చేసి, మూడో కంటికి తెలియకుండా వీటిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు నక్కా మహేష్ గతంలోనూ మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈజీ మనీకి అలవాటు పడిన మహేష్.. ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్ కు తరలించారు.