న్యూ ఇయర్ టార్గెట్ గా రంగంలోకి దిగిన డ్రగ్ మాఫియా !

Update: 2019-12-16 17:30 GMT
డ్రగ్స్..మెల్లి మెల్లిగా మత్తులో ముంచి - ఆ తరువాత దానికి బానిసగా మార్చుకొని - చివరికి    ప్రాణాల మీదకు తీసుకొచ్చే ఒక ప్రమాదకరమైన మాదకద్రవ్యం. దీనిపై  యూత్‌ కి ఎంతలా అవగాహన పెంచినా చాపకింద నీరులా ఇది విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా.. యువకులే టార్గెట్‌ గా ఈ డ్రగ్స్ దందా నడుస్తోంది. ఇప్పుడు ఈ డ్రగ్స్ గొడవ దేనికి అంటారా .. హైదరాబాద్‌ లో ఈ న్యూఇయర్ సెలబ్రేషన్సే టార్గెట్‌ గా డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగిందట.

ఈ డ్రగ్ మాఫియా  .. కొన్ని రోజుల క్రితం.. డ్రగ్‌ ని సరఫరా చేసేవారు ఉల్లిపాయ - ఎండుమిర్చీల్లో కూడా తరలించారు. రకరకాల పరికరాల్లో వీటిని అమర్చి దందా చేసేవారు. కానీ, ఇప్పుడు మానవ దేహాలనే - డ్రగ్ కంటైనర్లుగా వాడుకుంటోంది డ్రగ్ మాఫియా. ఎల్‌ ఎస్‌ డీ తదితర మత్తు మందులను పౌడర్ - ట్యాబ్లెట్ల రూపంలో నింపి - వాటిని డ్రగ్ రవాణాకు అంగీకరించిన ఓ మనిషి శరీరంలో - రహస్య అవయవాల్లో దాచి.. స్కానర్లకు అందని రీతిలో సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు మానవ శరీరాలతో డ్రగ్ సరఫరా చేసేవారిని పోలీసులు పట్టుకున్నారు.

ఈ సారి 2020 న్యూ ఇయర్‌ వేడుకలను టార్గెట్‌ చేసి హైదరాబాద్‌ కు డ్రగ్స్‌ తరలిస్తోంది మాఫియా. మరో 15 రోజుల్లో 2020 న్యూయర్ వేడుక రానుంది. దీంతో.. ఆ ఫెస్టివల్‌ను టార్గెట్ చేస్తూ.. పెద్ద మొత్తంలో డ్రగ్స్ చేతులు మారనుందని సమాచారం. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం నేపథ్యంలో.. ఇప్పటికే పోలీసులు తనిఖీలు కూడా షురూ చేశారు. శంషాబాద్ ఎయిర్‌ పోర్టుల్లో - రైల్వే స్టేషన్లలో - బస్‌ స్టేషన్‌ లలో రెక్కీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పందంగా వ్యవహరించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  అయితే..తాజాగా  ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఈ సారి న్యూయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించనున్నారని సమాచారం. 
Tags:    

Similar News