పింఛన్ డబ్బుల కోసం తండ్రిని చంపాడు

Update: 2019-07-13 05:51 GMT
మద్యం మత్తులో వచ్చి పింఛన్ డబ్బుల కోసం ఏకంగా తండ్రిని కొట్టి చంపిన వ్యవహారం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా చందర్పపాడు గ్రామంలో మహబూబ్ సాహెబ్ అనే కుటుంబం నివసిస్తోంది. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం పెంచిన పింఛన్ డబ్బులు నెలనెలా అందుతున్నాయి. ఈ నెల 8న పింఛన్ డబ్బులను సాహెబ్ తీసుకున్నాడు.

ఇప్పుడు ఈ డబ్బులను కూడా కావాలని సాహెబ్ కొడుకు షిలార్ 8న రాత్రి తండ్రిని అడిగాడు. మద్యం తాగి కొడుకు గొడవ చేశాడు. అయితే తండ్రి మాత్రం డబ్బులు ఇవ్వనని స్పష్టం చేశారు. దీంతో మద్యం మత్తులో కొడుకు షిలార్ ఏం చేస్తున్నాడో తెలియకుండా వ్యవహరించాడు. తండ్రిని కొడుతూ బాత్రూంలో బంధించాడు. గోడకు బలంగా కొట్టడంతో తండ్రి సాహెబ్ సృహ తప్పి పడిపోయాడు.

వెంటనే కుటుంబ సభ్యులు సాహెబ్ ను స్థానిక ఆస్పత్రికి తరించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాహెబ్ మృతి చెందాడు. ఈ తతంగాన్ని అంతా సాహెబ్ కూతురు వీడియో తీయడంతో ఇది వైరల్ గా మారింది.

అయితే తండ్రి సాహెబ్, కొడుకు షిలార్ లు ఇద్దరూ మద్యం మత్తులోనే ఉన్నట్టు సాహెబ్ పెద్ద కుమారుడు చందార్ తెలిపాడు.  పింఛన్ డబ్బుల కోసమే ఈ దారుణం జరిగిందని వివరించాడు. మద్యానికి బానిసైన షిలార్ తన తండ్రి పింఛన్ డబ్బుల కోసమే ఈ దాడికి పాల్పడ్డట్టు తెలిపాడు.  

    

Tags:    

Similar News