పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం! అంతేకాదండోయ్, వాటిని సేవించడం ఆలోచనలకు కూడా హానికరమేనని నిరూపించాడో వ్యక్తి. మత్తుపదార్థాలతో నిండిన పొగతాగిన అతడు ఓ వింత కోరిక కోరాడు. ఏకంగా మొసలితో సంపర్కాన్ని కోరుకున్నాడు. విచక్షణ కోల్పోయి దాని నోట్లో తలపెట్టి చేజేతులా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఆస్ట్రేలియాలోని ఓ 26 ఏళ్ల యువకుడు తన ఐదుగురు స్నేహితులతో కలిసి బీచ్ దగ్గర రిసార్ట్ దగ్గర పార్టీ చేసుకున్నాడు. ఊటుగా మద్యం సేవించిన తర్వాత మత్తుపొగను తాగాడు. దాంతో ఆ వ్యక్తి ఆలోచనలు అదుపు తప్పాయి. తనకు మొసలితో రొమాన్స్ చేయాలని ఉందని మిత్రులకు చెప్పాడు. స్నేహితులు వారించే ప్రయత్నం చేసినా వారి నుంచి విడిపించుకొని వెళ్లిపోయాడు. సైకోలా ప్రవర్తిస్తూ బీచ్ వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాడు.
అతడికి మొసలి కనిపించిన వెంటనే తన దుస్తులన్నీ విప్పేసి దానిని అక్కున చేర్చుకున్నాడు. ఇంకేముంది ఆ మొసలి అతడిని నీళ్లలోకి లాక్కొని వెళ్లిపోయింది.అతడు చనిపోయాడా బతికాడా అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు.
తనిఖీలు నిర్వహించినా కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో అతడు చనిపోయాడని నిర్దారణకు వచ్చారు. వారు సేవించిన మత్తుపదార్థాల్లో విపరీతంగా లైంగిక వాంఛలు పెంచేందుకు అనువైన ఐస్ అనే పదార్థం ఉందని తెలిసింది. ఆ మత్తుకు చిత్తయి నిండు జీవితాన్ని బలి చేసుకున్నాడా యువకుడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/