మద్యం మత్తులో ఒక మహిళ చేసిన రచ్చ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో మద్యం మత్తులో వీరంగం వేసే ఆడోళ్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ వ్యవహరించిన వైనం అక్కడి పోలీసులకు మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది.
మహిళా ఎస్ ఐను గిచ్చటమే కాదు.. పోలీస్ కానిస్టేబుల్ ను కొరికిన వైనం పెను సంచలనంగా మారింది. బంజారాహిల్స్ కు చెందిన లీసా అనే మహిళ మద్యం మత్తులో రోడ్డు పక్కన పడిపోయి ఉంది. దీంతో ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మత్తు నుంచి తేరుకున్న ఆమె స్టేషన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది.
దీంతో ఆమెను ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని గిచ్చి.. కొరికేసి రచ్చ రచ్చ చేసింది. బండబూతులు తిడుతూ తనను వదిలేయాలంటూ దాడికి పాల్పడింది. పోలీసులతో పాటు ఎస్ ఐ పైనా దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా పలువురు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అతి కష్టమ్మీదా ఆమెను పట్టుకొని స్టేషన్ లో ఉంచారు.
తనను విడిచి పెట్టకపోతే అంతు చూస్తానని బండబూతులు తిట్టేసిన ఆమె వివరాలు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నాగాలాండ్ చెందిన ఈ మహిళ మాదాపూర్ లో పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఆమె ప్రవర్తన చూస్తే.. డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం కలుగుతోందని చెబుతున్నారు. పరీక్షలు జరపటంతో పాటు.. ఆమె సంబంధీకుల్ని స్టేషన్ కు పిలిపించి.. వారికి అప్పగిస్తామంటున్నారు. మత్తులో చెలరేగిపోయిన సదరు మహిళ వ్యవహారం బంజారాహిల్స్ పోలీసులకు చుక్కలు చూపించిందని చెప్పక తప్పదు.