ఫుల్లుగా మందేసి రోడ్డుపై యువతుల బీభత్సం..!

Update: 2020-08-23 10:30 GMT
ఫుల్లుగా మందేస్తే కొంతమంది మందుబాబుల బిహేవియరే మారి పోవడం చూస్తుంటాం. దారిన పోయే మహిళలను వేధించడం, వాళ్లలో వాళ్ళే కొట్టు కోవడం, ఇంటికెళ్లి భార్యతో గొడవ పడటం రోజూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మహిళలు కూడా మగాళ్లకు మేమేమి తక్కువ కాదంటున్నారు. హైదరాబాద్ లో ఫుల్లుగా మందేసి నానా బీభత్సం చేశారు. రోడ్డున వెళ్తున్న వారిని ఆపి కొట్టారు. కొందరి దగ్గర డబ్బు లాగేసుకున్నారు. రోడ్డులోనే మందు కొడుతూ..దమ్ము కొడుతూ..ఓ యువకుడు కనిపిస్తే అతడి బట్టలు విప్పి వికృతంగా ప్రవర్తించారు. యువతులు అంత బరితెగింపునకు దిగడం సంచలనంగా మారింది. ఎంత మందేస్తే మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటని అంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చైతన్యపురి కనకదుర్గ వైన్స్ దగ్గర ఉన్న బస్టాప్ లో శనివారం రాత్రి నలుగురు యువతులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి, వైట్ నర్ పీల్చుతూ వైన్ షాప్ దగ్గరికి వచ్చిన వారితో, ఆ రోడ్డు వెంట వెళ్తున్న వారితో గొడవ పెట్టుకున్నారు. కొందరిపై దాడి చేశారు. ఓ యువకుడు అక్కడి బస్ స్టాప్ లో పడుకుని ఉంటే అతడి బట్టలు విప్పేసి నీచంగా ప్రవర్తించారు. యువతులు బహిరంగ ప్రదేశంలో ఇంత దారుణంగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. రోడ్డుపై వెళ్తున్న వారిని ఆపి దౌర్జన్యంగా డబ్బు లాక్కున్నారని పలువురు ఆరోపించారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు అటుగా రాలేదని.. తాగి రభస చేసిన యువతులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Tags:    

Similar News