రాజకీయాల పట్ల వైసీపీ మాజీ మంత్రి పూర్తిగా నిర్వేదం చెందారా. లేక తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కలత పడ్డారా లేక ఎంత చేసినా ఇంతే అని వేదాంతం బాట పట్టారా అంటే అన్నింటికీ ఒక్కటే జవాబు. అవును అవంతి శ్రీనివాసరావు తీవ్ర నిరాశలో ఉన్నారనే. ఆయన నోట మాటలు ఆ విధంగానే వస్తున్నాయని అంటున్నారు.
తన సొంత నియోజకవర్గం భీమిలీలోని పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన మాజీ మంత్రి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. రాజకీయాలు అంటే అర్ధం మారిపోయాయి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఒకపుడు రాజకీయం అంటే జనాలు నాయకుడికి ఎదురేగి తీసుకువచ్చేవారని, వారే అన్నీ అయి ఉండేవారని ఫ్లాష్ బ్యాక్ కధలు చెప్పారు అవంతి.
ఇపుడు రాజకీయం అంటే సొంత జేబులో నుంచి కోట్ల రూపాయలు తీసి ఒక్క రూపాయి సంపాదన లేకుండా రాజకీయం చేయాల్సి వస్తోంది అని ఆయన అన్నారు. అంతే కాదు రాజకీయ నేత పని ఎలా ఉంది అంటే క్షణం తిరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేదు అన్నట్లుగా అని ఆయన సెటైర్లు వేశారు. ఇదే కదా ఇప్పటి రాజకీయం అంటూ ఆయన వేదిక మీద ఉన్న వారిని కూడా ప్రశ్నించారు.
ప్రభుత్వ అధికారులను ఆయన వెనకేసుకుని వస్తూ అధికారులు పాపం కొత్త పధకం వస్తే తమకు ఏదైనా అని ఆశ పడతారని, ఇపుడు వారు నోళ్ళూ ఎండిపోయాయని అని మరో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అవంతి. నేరుగా లబ్దిదారుని ఖాతాలోకే పధకాలు వచ్చి పడిపోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
మొత్తానికి అవంతి మాటలను బట్టి చూస్తే ఆయన వర్తమాన రాజకీయం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారా లేక తాను ఉన్న పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నారా అన్నది అర్ధం కావడంలేదు అని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పధకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడిపోతున్నాయని అవంతి ఎత్తిపొడవడం వెనక పరోక్ష విమర్శలు ఉన్నాయనే అంటున్నారు.
ఆయనకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాదు అని ప్రచారం సాగుతోంది. టీడీపీలోకి వెళ్తారన్నా కూడా అక్కడ కూడా బెర్త్ కన్ ఫర్మ్ కాదు. జనసేన పవన్ కళ్యాణ్ అవంతి మీదనే నేరుగా విమర్శలు చేస్తారు. దాంతో అవంతి రాజకీయం ట్రబుల్ లో పడింది అనే అంటున్నారు. అందుకే ఆయన ఇండైరెక్ట్ గా ప్రభుత్వ పధకాల మీద ప్రస్తుతం రాజకీయ నాయకుల పరిస్థితి మీద ఇలా హాట్ హాట్ కామెంట్స్ చేశారని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఇదే సభలో సున్నా వడ్డీ పధకం మహిళలకు బాబు ఇచ్చాడా అని అవంతి అడగగా ఇచ్చాడని ఒక మహిళ ఠక్కున చెప్పడంతో అవంతి అవాక్కు అయ్యారు. సభకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వాలని ఆయన వేదిక మీద నుంచే అధికారులను కోరడం విశేషం. మొత్తానికి అవంతి మదిలో ఏముందో తెలియడంలేదు కానీ దమ్మిడీ ఆదాయం లేదు అంటూ ఆయన వల్లించిన రాజకీయ వేదాంతం మాత్రం చర్చకు తావిచ్చేలా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.