చంద్రబాబు కలలు కంటున్న ఈ గవర్నెన్సుపై కొందరు సీనియర్ అధికారులు విముఖత చూపుతున్నారు. అందులో లోపాలను వారు ఎత్తిచూపుతున్నారు. ఇ-ఆఫీసు విధానమంటే కాగితాలతో పనిలేకుండా ఆన్ లైన్లో కంప్యూటర్లతోనే ఫైళ్లను నడపడం - పరిష్కరించడం. కానీ ఎంతో ప్రాధాన్యం గల ఇ-ఫైల్ సిస్టమ్ భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జావా ప్రాజెక్టుల విధానంలో రూపొందించిన ఈ ఇ-ఆఫీస్ లో హ్యాకింగ్ కు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అంతే కాదు ఈ విధానంలో పెండింగు ఫైళ్లు ఎక్కువవుతాయని చెబుతున్నారు.
ఇ-ఫైల్సు విషయంలో సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది తక్కువగా ఉన్నారు. దీన్ని సమర్థంగా వినియోగించే వారు కూడా దిగువ స్థాయిలో తక్కువగా ఉన్నారు. అందువల్ల ఇ-ఆఫీస్ కన్నా కాగితాలపై ఫైళ్ల పరిష్కారమే మంచిదని సీనియర్ అధికారులు కొత్త వాదన లేవనెత్తుతున్నారు. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఇ-ఆఫీస్ పైనే మక్కువ చూపిస్తోంది. ముఖ్యంగా సచివాలయం - కలెక్టర్ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ను వినియోగిస్తున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలుకు ముందుగా సెక్షన్ అధికారుల నుంచి అదనపు కార్యదర్శి వరకు ఉన్న ఉద్యోగులు తమకు వచ్చిన ఫైళ్లను స్కాన్ చేయంచి కంప్యూటర్లలో నిక్షిప్తం చేయించాల్సి ఉంటుంది. వాటి రిఫరెన్స్ లనూ కంప్యూటర్ లోనే ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. అనంతరం వాటిని కార్యదర్శి - ఆపై స్థాయి అధికారులకు పంపిస్తారు. వారు కూడా పరిశీలించి తమ డిజిటల్ సంతకంతో ఆ పై అధికారులకు పంపుతారు. అవసరమైతే చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ముఖ్యమంత్రికి వరకు కూడా ఇ-ఆఫీస్ ద్వారానే ఆ ఫైలు కదలాల్సి ఉంటుంది. ఫైళ్లను తెరిచిన సమయంలో, తమ ఉన్నతాధికారులకు పంపించే సమయంలో సెక్యూరిటీ ప్రాబ్లెమ్ వస్తోందని చెబుతున్నారు. వాటిలోని సమాచారం హ్యాకింగుకు గురైతే ఎవరైనా అందులో మార్పులు చేర్పులు చేసే ప్రమాదముందని అంటున్నారు. అదొక్కటే కాకుండా వందల పేజీలతో ఉండే ఇ-ఫైళ్లలో రిఫరెన్స్ పేజీ ఎక్కడుందో తెలుసుకోవడం కూడా కష్టతరమంటున్నారు. ఇందువల్ల ఒక్కో ఫైలుకు కనీసం 20 నిముషాల నుంచి అరగంట సమయం పడుతుందని చెబుతున్నారు.
దీనివల్ల ఇ-ఆఫీస్ విధానంలోనూ ఫైళ్లు నత్తనడకనే సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వివిధ శాఖల్లోని వందలు, వేలల్లోని ఫైళ్లు పెండింగు పడుతున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలోని వివిధ శాఖల్లోనే వేల సంఖ్యలో ఇ-ఆఫీస్ ఫైళ్లు పెండింగులో ఉన్నాయట. అందులో కొన్ని నెలల తరబడి కూడా కదలిక లేనివీ ఉన్నట్లు సమాచారం. అటవీశాఖకు చెరదిన ఒక ఇ-ఫైలు ఏకంగా పది నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే పెండింగులో ఉందని చెబుతున్నారు. అత్యధికంగా ఆర్థిక శాఖలో 2380 ఇ-ఫైళ్లు - విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థలో 1818 - పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధిశాఖలో 1156 - పౌర సరఫరాల శాఖలో 1108 - ఎపి టెక్నాలజీస్ సర్వీసెస్ లో 750 - రెవెన్యూ శాఖలో 908 - వైద్య ఆరోగ్య శాఖలో 930 - పట్టణాభివృద్ధి శాఖలో 885 - బిసి సంక్షేమ శాఖలో 570 - విద్యుత్ శాఖలో 510 ఇ-ఆఫీస్ ఫైళ్లే పెండింగులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. క్రిడాలో 900 - తూర్పుగోదావరి కలెక్టరేట్ లో 5100 - పశ్చిమ గోదావరి కలెక్టరేట్ లో 3080 ఫైళ్లు - గుంటూరు కలెక్టరేట్ లో 1196 ఫైళ్లు - చిత్తూరు కలెక్టరేట్ లో 1156 ఇ-ఫైళ్లు ఫెండింగు పడ్డాయని చెబుతున్నారు. దీంతో సీనియర్ అధికారులంతా పాత విధానమే బెస్టని చంద్రబాబుకు సూచిస్తున్నారు.