వ‌ల‌స కార్మికుల ఆక్రంద‌న‌.. పోలీసుల భ‌యాందోళ‌న‌!

Update: 2020-05-05 11:10 GMT
లాక్‌డౌన్ పొడ‌గిస్తూనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్ని స‌డ‌లింపులు ప్ర‌క‌టించింది. ముఖ్యంగా వ‌ల‌స కార్మికులు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించి వ‌దిలేసింది. స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయ‌లేదు. కార్మికుల త‌ర‌లింపుపై కేంద్రానికే స్ప‌ష్ట‌త లేదు. అందుకే రోజుకో నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తోంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇచ్చింద‌నే విష‌యంతో దేశంలో వ‌ల‌స కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఉపాధి కోసం వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారంతా త‌మ ప్రాంతాల‌కు వెళ్తామ‌నే ఆనందంలో ఉన్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వ‌క‌పోవ‌డం.. వారి త‌రలింపుపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌ పోవ‌డంతో క‌డుపుమండిన కార్మికులు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు మొద‌లుపెట్టారు. త‌మ‌ను స్వ‌రాష్ట్రాల‌కు పంపించాల‌ని కోరుతూ ధ‌ర్నాలు చేశారు. దీంతో దేశ‌వ్యాప్తంగా ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా మారిన మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో వారిని క‌ట్ట‌డి చేయ‌డానికి పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతో పోలీసుల‌పై వారు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.  వీటితో అన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసులపై దాడులు జ‌రుగుతున్నాయి. గందరగోళ పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అధికారులు మధ్య సమన్వయం లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆంంధ్ర‌ప‌దేశ్‌, తెలంగాణ, గుజరాత్‌ల‌లో వలస కార్మికులు పోలీసులపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. పోలీసుల‌తో వాగ్వాదం ప‌డుతూ రాళ్ల దాడి కూడా చేస్తున్నారు. పోలీసుల వాహనాలను ధ్వంసానికి పాల్ప‌డుతున్నారు.

అలాంటి ఘ‌ట‌న‌లే సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హైదరాబాద్‌ క్యాంపస్‌లో వలస కార్మికులు పోలీసులపై దాడులు చేసిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు జ‌రిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కూడా పోలీసుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. గుజ‌రాత్‌లోని సూర‌త్‌, క‌ర్నాట‌క‌లోని బెంగ‌ళూరులో ఇలాంటి సంఘ‌ట‌న‌లే జ‌రిగాయి. పెద్ద సంఖ్య‌లో వలస కార్మికులు ఆందోళనకు దిగుతుండ‌డం తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పుడుతున్నాయి.

బెంగళూరులోని క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వేస్టేషన్, యశ్వంత్‌పుర స్టేషన్ల వ‌ద్ద ప‌రిస్థితులు చేయి దాటాయి. వేల మంది వలస కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయ పడ్డారు. వలస కార్మికులను స్వస్థలాల‌ తరలింపు గొడ‌వ‌లో పోలీసులు బ‌ల‌వుతున్నారు. కేంద్ర హో మంత్రిత్వ శాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసి కార్మికుల త‌ర‌లింపు బాధ్య‌త‌ను రాష్ట్రాల‌కు వ‌దిలేయ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. వీరి ఆందోళ‌న‌ల‌తో ప్ర‌స్తుతం లాక్‌డౌన్  అమ‌లును పోలీసులు విస్మ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Tags:    

Similar News