ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటే దాదాపుగా ఏడాది క్రితం నుంచి ప్రచారం సాగుతోంది. జగన్ రెండేళ్ళ పాలన తరువాత నుంచే ఇది మొదలైంది. జగన్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్తారని టీడీపీ సహా ఇతర పార్టీలు చెబుతూ వచ్చాయి. ఇక ఈ ఏడాది మే 30 నాటికి మూడేళ్ళ పాలన పూర్తి అయింది. దాంతో ముందస్తు ఎన్నికలు అన్న వాదన మరింతగా పెరిగింది.
దాంతో చంద్రబాబు జోరు పెంచేశారు. ఆయన అన్ని జిల్లాలనూ తిరుగుతున్నారు. ఇక సినిమాలు చేసుకుంటూ 2023 చివరి నాటికి తాపీగా ఎన్నికల సమరానికి దిగాలనుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఏడాది ముందే తన షెడ్యూల్ మార్చేసుకుని బరిలోకి దిగిపోతున్నారు. ఆయన అక్టోబర్ 5 విజయదశమి వేళ బస్సు యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. జనసేన లెక్కల ప్రకారం చూస్తే 2023 ఏప్రిల్ మే నెలల మధ్యలో ముందస్తు ఎన్నికలు ఏపీకి వస్తాయని. ఆ మాటను ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా అన్నారు.
ఇక చినబాబు లోకేష్ కూడా ఏపీ వ్యాప్త టూర్లకు రెడీ అయిపోతున్నారు. ఇంకో వైపు పొత్తుల కోసం కూడా ఆరాటాలు ఎక్కువ అయిపోతున్నాయి. వీటికి ఒక రకంగా వైసీపీ కారణం అని చెప్పాలి. ఆ పార్టీ కీలక నేత. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే ఎన్నికలు ఎపుడైనా రావచ్చు అన్నట్లుగా ఆ మధ్యన మీడియాతో మాట్లాడి కొంత కలవరం కలిగించారు.
ఇక జగన్ అయితే ఎన్నికల వేడిని పెంచేలా పార్టీ నేతలతో వరస సమావేశాలు జరపడం, అలాగే వర్క్ షాప్స్ పేరిట ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవడం, ఇక గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలను పంపించడం వంటి వాటితో ఎన్నికల వాతావరణాన్ని తనకు తానుగా సిద్ధం చేశారు అని అంటున్నారు.
డిసెంబర్ నాటికి మెజారిటీ నియోజకవర్గాలలో అభ్యర్ధుల జాబితాను రెడీ చేస్తారు అని కూడా వైసీపీలో వినిపిస్తున్న విషయం. ఇదిలా ఉంటే జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకం అయిన వెలుగొండ ప్రాజెక్ట్ రెండవ దశను వచ్చే ఏడాది సెప్టెంబర్ లో పూర్తి చేస్తామని ప్రకటించారు. అది పూర్తి చేసి జాతికి అంకితం చేసి అపుడే ఎన్నికలకు వెళ్తామని జగన్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
అంటే ఇప్పటికి సరిగ్గా మరో పదమూడు నెలల తరువాత వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అన్న మాట. సెప్టెంబర్ అని చెబుతున్నా అది ఆ ఏడాది చివరికి పూర్తి అయినా కావచ్చు. మరి అప్పటికి 2024 ముంగిట అంతా ఉంటారు. మరి 2024లోనే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అంటే ఎటు నుంచి ఎలా ఆలోచించినా జగన్ నోట ఈ మాట వచ్చాక ముందస్తు ఎన్నికలు అన్న ప్రసక్తే లేదు అని అంటున్నారు.
దానికి కారణాలు ఏంటి అంటే ఏపీలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. దాంతో ఎంతో కొంత ఏదో చేశామని చెప్పుకోకుండా ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది అవుతుంది అని భావించే ముందస్తుకు నో చెప్పేశారు అని అంటున్నారు. ఇక వైసీపీ గెలుస్తుంది అనుకుంటే ఇపుడు వెళ్ళినా షెడ్యూల్ టైమ్ కి వెళ్ళినా ఒక్కలాగే రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా వ్యతిరేకత వస్తుంది అనుకుంటే చేతిలో ఉన్న పాలనను అధికారాన్ని అనవసరంగా వదులుకుని చేయి కాల్చుకోవడం తప్ప మరేమీ ఉండదు.
అందుకే వైసీపీ ఇపుడు ఎంతో కొంత చేసి చూపించి ఎన్నికల గోదాలోకి దిగాలనుకుంటోంది. దానికి చేతిలో ఉన్న ఇరవై నెలల టైమ్ ని జాగ్రత్తగా వాడుకోవాలని చూస్తోంది. సో ఏపీలో ముందస్తు లేనట్లే. మరి తొందరపడి విపక్షాలు గోదాలోకి దిగితే వారికి లాభమే తప్ప నష్టం ఉండకపోవచ్చు. కానీ అసలైన ఎన్నికల సమయానికి మాత్రం చేతి చమురు వదిలించుకున్న వారికే ఇబ్బందులు వస్తాయన్నది మాత్రం చెప్పకతప్పదు.