గురి చూసి కొట్టటంతో ప్రధానమంత్రి మోడీ లెక్కలే వేరుగా ఉంటాయి. లాక్ డౌన్ 4.0కు సిద్ధమన్న విషయాన్ని మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించిన ప్రసంగంతో స్పష్టం చేయటం తెలిసిందే. అందరి అంచనాలకు భిన్నంగా రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీని తమ ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రకటించి విస్మయానికి గురి చేశారు. ఆచితూచి అన్నట్లుగా ఖర్చు చేసే అలవాటున్న మోడీ ప్రభుత్వం.. ఏకంగా రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించటం సంచలనంగా మారింది. అయితే.. తాను చెప్పిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఏమిటన్న విషయాన్ని దశల వారీగా వెల్లడిస్తామని సస్పెన్స్ ను మరింత పెంచేశారు మోడీ.
రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ అన్నప్పుడు.. అందుకు అవసరమైన నిధుల్ని కేంద్రం ఎలా సమీకరించిందన్నది ప్రశ్న. దానికి సమాధానం వెతికే క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ప్రజల మీద బాదేసిన పన్ను మొత్తాన్ని ప్యాకేజీ కింద ప్రకటించారన్న విషయం అర్థమవుతుంది. ముడిచమురు ధరలు పాతాళానికి చేరుకున్నా.. ఆ ఫలాలు జాతి జనులకు అందలేదన్న విషయం తెలిసిందే.
ఎక్సైజ్ సుంకాన్ని పెంచటం ద్వారా ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం.. భారీ ప్యాకేజీ ప్రకటనకు సాయం చేసిందని చెప్పాలి. పెట్రోల్.. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు.. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దాదాపు రూ.13లక్షల కోట్ల మొత్తాన్ని కేంద్రం సమీకరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. మార్కెట్ రుణాల్ని రూ.4.20లక్షల కోట్లు పెంచుకుంది. దీంతో.. దగ్గర దగ్గర రూ.17.2లక్షల కోట్లు సమీకరించింది. దీనికి అదనంగా రూ.2.8లక్షల కోట్లను జోడించటం ద్వారా రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటనకు అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. వాత పెట్టి వెన్న పూసే విషయంతో మోడీ మాష్టారి తర్వాతే ఎవరైనా బాసూ!