కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారతదేశం తీసుకుంటున్న చర్యలను ఓ విదేశీ ఆర్థిక వేత్త తప్పుబట్టారు. భారతదేశానికి ఇంకా కరోనాను ఎదుర్కొనే సత్తా లేదని - కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న వైద్యారోగ్య సేవలు ప్రస్తుతం కరోనా వైరస్ బాధితులకు సరిపడా లేవని తెలిపారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలు - ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై స్పందించారు.
ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ జాన్ హాప్కిన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్స్ - గ్లోబల్ హెల్త్ అండ్ బిజినెస్ ఎంటర్ ప్రైజ్ స్టడీస్‌ల వ్యవస్థాపకుడు - సహ డైరెక్టర్. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తల్లో ఒకరు. ఆయన భారతదేశంతోపాటు దక్షిణ ఆసియాలోని సమస్యలపై హాంకే పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ముందస్తుగా సిద్ధం కాలేదని చెప్పారు.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కాలేదని - భారత్ లో కరోనా నిర్ధరణ పరీక్షలకు - రోగులకు చికిత్స అందించేందుకు సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. దేశంలో లాక్‌డౌన్ విధించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా అమల్లో లాక్‌డౌన్ ఉండగా కొన్ని అత్యావసర - నిత్యావసర సేవలు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. తానెప్పుడూ సంపూర్ణ లాక్ డౌన్ ను సమర్థించలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం దక్షిణ కొరియా - స్వీడన్ - యూఏఈల మాదిరిగా స్మార్ట్ గా - స్పష్టమైన లక్ష్యంతో కూడిన విధానాలకు తాను అనుకూలమని వెల్లడించారు. క్రీడా కార్యక్రమాలను - మతపరమైన సమావేశాలను రద్దు చేయడాన్ని సమర్థించినట్లు గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధించిన లాక్ డౌన్ ను ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రకటించారని - అసలు ప్రణాళిక అనే పదానికి అర్థ ఏమిటో మోదీకి తెలియదని సంచలన వ్యాఖ్య చేశారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించడంతో పాటు మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కు సిద్ధం కావడానికి ప్రజలకు కేవలం నాలుగు గంటలు సమయం ఇవ్వడం సరికాదన్నారు.
దేశంలో లాక్ డౌన్ అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది? దాని అమలు కోసం ఎలాంటి ప్రణాళికలు చేశారు? అనే విషయాలపై కొంతమంది మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
సింగపూర్ - ఇటలీ - జపాన్ - చైనా తదితర దేశాలలో పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో భారతదేశంలో వాతావరణం సాధారణంగా ఉంది. మోదీ ముందస్తుగా సంసిద్ధం కాకుండానే లాక్ డౌన్ ప్రకటించాడని - దీంతో పేదలు తీవ్ర కష్టాలు పడుతున్నారని చెప్పారు. 81 శాతం మంది భారతీయులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారని ప్రస్తుతం వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం - చట్టాలను అమలు చేయడం - అవినీతి పరిపాలన - న్యాయ వ్యవస్థలను సంస్కరించడం వంటి పనులు చేయడం తక్షణ కర్తవ్యమని పరిష్కార మార్గాలు చూపారు. నోట్ల రద్దు లాంటి నిర్ణయాల ద్వారా శ్రామిక శక్తిని ఆధునిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాలేరదని ఆర్థికవేత్త స్పష్టం చేశారు.
భారత్ లో వైద్య ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంది అని చెప్పడానికి మహారాష్ట్రను ఉదాహరణగా చెప్పొచ్చని పేర్కొన్నారు. సింగపూర్ తరహాలో భారతదేశంలో భారీ మొత్తంలో పరీక్షలు చేసి రోగులను గుర్తించాలని సూచించారు. అయితే ఆ విధంగా విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ లో సరైన సదుపాయాలు లేవని తేల్చిచెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కచ్చితమైన - శస్త్ర చికిత్సలాంటి విధానాలను అనుసరించాలని తెలిపారు.