కరోనా మహమ్మారి దశల వారీగా విజృంభిస్తోంది. వైరస్ ను ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని నిపుణులు నొక్కి చెప్పారు. ఇప్పటికే చాలా దేశాలు వివిధ వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో వైరస్ పై వ్యాక్సిన్ల ప్రభావం, రాబోయే వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యంపై నిపుణులు ప్రయోగాలు చేపట్టారు. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న టీకాలపై చేసిన అధ్యయనాల ఫలితాలను రాక్ ఫెల్లర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
కొవిడ్ ను టీకాలతో ఎంతవరకు ఎదుర్కొగలమని శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా అధ్యయనం చేశారు. అంతేకాకుండా భవిష్యత్ లో రాబోయే వేరియంట్లపై ప్రభావం చూపుతుందా? అనే అంశాన్ని పరిశీలించారు. మహమ్మారిపై పోరాటంలో వైరస్ విజయవంతమవుతున్నట్లు ఫలితాల్లో వెల్లడించారు. టీకాలతో మానవ శరీరంలోని సాధారణ రోగ నిరోధక శక్తి పెరుగుతోందని తెలిపారు. యాంటీబాడీలు వైరస్ పై ఎదుర్కొంటాయని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ల వల్ల మానవ శరీరంలోని మెమోరీ బీ కణాలు మహమ్మారిపై పోరాటం చేస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి మెరగవుతుందని చెబుతున్నారు. భవిష్యత్ లో రాబోయే వైరస్ వేరియంట్లను ఎదుర్కొంటాయని తెలిపారు. ఇతర వైరస్ లను జయించే సామర్థ్యం కలిగి ఉంటున్నాయని వెల్లడించారు. టీకాల ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్లకు ఈ సామర్థ్యం ఉందని తేల్చారు.
ప్రస్తుతం ఉన్న వేరియంట్లనే కాకుండా భవిష్యత్ లో దాడి చేసే వైరస్ లను ఎదుర్కొనే సామర్థ్యం టీకాలకు ఉందని సానుకూల అంశాలను ప్రస్తావించింది. మహమ్మారి వార్తలను చూస్తూ మానసికంగా కుంగిపోతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశమే. ఈ ఫలితాలతో భవిష్యత్ ఆశాజనకంగా ఉంది. అన్ని దేశాల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయితే ఈ మహమ్మారిని సమూలంగా ఎదుర్కొన్నట్లు అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం గమనార్హం.