ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నక్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విషయంలో ఆసక్తికరమైన సమాచారం తెరమీదకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్.. ట్రేడింగ్ లో దూసుకెళ్లుతున్న విషయం తెలిసిందే. ఈ క్రిప్టో కరెన్సీపై ఇప్పటికే చాలా వరకు దేశాలు నిషేధం విధించాయి. ఇటీవల భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం ఈజిప్టు కూడా దీనిపై స్పందించింది. బిట్‌కాయిన్ లావాదేవీలు ఇస్లాం మతానికి వ్యతిరేకమని ఈజిప్టుకు చెందిన గ్రాండ్ ముఫ్తీ షాకి ఆలం తెలిపారు.
బిట్ కాయిన్ పై ఈజిప్ట్ ఇస్లాం మత పెద్ద షాకీ ఆలం కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బిట్ కాయిన్ నిషేధమని ఆయన ఫత్వా జారీ చేశారు. క్రిప్టో కరెన్సీ ఒకరకమైన గ్యాంబ్లింగ్ అని, దాన్ని ఇస్లాం వ్యతిరేకిస్తున్నదని ఆయన అన్నారు. షరియత్ చట్ట ప్రకారం బిట్ కాయిన్ ట్రేడింగ్ చట్టవ్యతిరేకమన్నారు. బిట్ కాయిన్ వల్ల మనీల్యాండరింగ్ జరిగే అవకాశం ఉందని, ఎందుకంటే అది ప్రభుత్వ ఆధీనంలో లేదని - అది ఈజిప్టు ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగలదని ఇమామ్ అన్నారు.
కాగా, బిట్ కాయిన్ విలువ నేలచూపులు చూస్తోంది. 2015 నుంచి గమనిస్తే.. పతనమనేదే ఎరుగకుండా మదుపరులకు కాసుల వర్షం కురిపించిన ఈ క్రిప్టో కరెన్సీ తొలిసారిగా 2018కి మాత్రం నష్టాలతో స్వాగతం పలికింది. గతేడాది చివరి రెండు నెలల్లోనే వందల రెట్లు పెరిగిన దీని విలువ.. డిసెంబర్ 18న రికార్డు స్థాయిలో 19,511 డాలర్లను చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత క్షీణిస్తూ పోగా, ఈ నెల 1న న్యూయార్క్ ట్రేడింగ్ లో 500 డాలర్లకు పైగా దిగజారి 13,624.56 డాలర్లకు పడిపోయింది. హాంకాంగ్ లో 1.9 శాతం క్షీణించింది. బుధవారం మాత్రం 14,951 డాలర్లకు పెరిగింది.