'ముంద‌స్తు' పై తెలంగాణ ఈసీ షాకింగ్ న్యూస్!

Update: 2018-09-05 14:50 GMT
ప్ర‌స్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు గురించి చ‌ర్చోప‌చర్చ‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రేపు ఉద‌యం 6.45 గంట‌ల‌కు కేసీఆర్ ....తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు చేయ‌బోతున్నార‌ని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంద‌స్తుకు గులాబీ బాస్ సిద్ధ‌మ్యార‌ని...ఈ క్ర‌మంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం - ప్ర‌ధాని మోదీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వచ్చేలా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని టాక్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌ల‌పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో శాసనసభను రద్దు చేసిన‌ప్ప‌టికీ....కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణయానికి అణుగుణంగానే రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ర‌జ‌త్ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు - ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయని ర‌జ‌త్ అన్నారు. అయితే, తెలంగాణ‌లో ఒకవేళ శాసనసభను రద్దు చేసినా....కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్ర‌కార‌మే ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని అన్నారు. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సాధార‌ణ ఎన్నికలకు సంబంధించిన‌ ప్రక్రియను మాత్ర‌మే తాము కొనసాగిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివిధ రాజకీయపార్టీలతో భేటీ అయ్యామ‌ని రజత్ తెలిపారు. రాష్ట్రానికి 84వేలకు పైగా వీవీ ప్యాట్ - కంట్రోల్ యూనిట్లు - లక్షా 23వేల బ్యాలెట్ యూనిట్లు అవసరమని - ఈసీఐఎల్ లో అవి సిద్ధమవుతున్నాయని చెప్పారు. న‌కిలీ ఓట‌ర్లు - ప‌లు చోట్ల ఓటు హ‌క్కు క‌లిగి ఉండ‌డం వంటి వాటిని నివారించేందుకు కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించామ‌ని అన్నారు. ర‌జ‌త్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి....ముంద‌స్తుకు గులాబీ బాస్ సై అన్నా...కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.
Tags:    

Similar News