ఎలక్షన్ కమీషన్ పై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణ..ట్యాపరింగ్ అనుమానం

Update: 2020-02-09 17:25 GMT
శనివారం రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 స్థానాలున్న ఢిల్లీ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కే దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. శనివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే మొత్తం 57.06 శాతం ఓటింగ్ నమోదైందని - పూర్తి స్థాయి లెక్కలు వచ్చిన తర్వాత ఇది పెరిగే అవకాశముందని ఎన్నికల అధికారులు తెలిపారు. కానీ పోలింగ్ ముగిసి 24 గంటలైనా ఇప్పటిదాకా ఫైనల్ పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయకపోవడం అనుమానంగా ఉందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు.

శనివారం రాత్రి గానీ - ఆదివారం ఉదయం గానీ ఓటింగ్ తుది శాతంపై ఎలక్షన్ కమీషన్ అఫీషియల్ ప్రకటన ఇస్తుందని ఎదురుచూసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. చివరకు ఈసీ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. పోలింగ్ పూర్తయిన ఇన్ని గంటల తర్వాత కూడా ఓటింగ్ శాతంపై ఈసీ ప్రకటన చేయకపోవడం షాకింగ్ గా అనిపిస్తోందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని, ట్యాంపరింగ్ ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచుకుని ఫలితాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ ఇలా అధికార లెక్కలు   విడుదల చెప్పకపోవడం పలు అనుమానాలకు, విమర్శలకు తావిచ్చింది.


Tags:    

Similar News