పందెం కోడి విష‌యంలో మ‌ళ్లీ అన్యాయం?

Update: 2017-12-07 10:43 GMT
నాట‌కీయ ప‌రిణామాలు తిరుగుతున్న సినీ న‌టుడు విశాల్ నామినేష‌న్ వ్య‌వ‌హారం మ‌రో ఆస‌క్తిక‌ర మ‌లుపు తిరిగింది. అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్  అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఒక‌సారి నోటిఫికేష‌న్ జారీ చేసి ర‌ద్దు చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఇటీవ‌ల మ‌రోసారి నోటిఫికేష‌న్ జారీ చేసింది. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత చిత్ర‌విచిత్రంగా మారిన త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్లే.. ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక నామినేష‌న్ ప్ర‌క్రియ సాగింది.

ఈ ఉప ఎన్నిక బ‌రిలో ప్ర‌ముఖ సినీన‌టుడు విశాల్ అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు.  ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. మిగిలిన అభ్య‌ర్థుల‌తో పోలిస్తే. విశాల్‌ కు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపించింది. ఇదే స‌మ‌యంలో ఊహించ‌ని రీతిలో ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

విశాల్‌ నామినేష‌న్ దాఖ‌లు చేసిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తూ సంత‌కాలు చేసిన ప‌ది మందిలో ఇద్ద‌రు.. తాము సంత‌కాలు పెట్ట‌లేద‌ని.. త‌మ సంత‌కాలు ఫోర్జ‌రీ అయ్యాయంటూ మీడియా ముందుకు రావ‌టం.. అధికార అన్నాడీఎంకే ఆ వెంట‌నే రియాక్ట్ కావ‌టం.. విశాల్ నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టం లాంటివి ఒక‌టి త‌ర్వాత ఒక‌టి  అన్న‌ట్లు ప‌రిణామాలు సాగాయి. చివ‌ర‌కు విశాల్ నామినేష‌న్‌ ను ర‌ద్దు చేస్తూ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై విశాల్ ఇప్ప‌టికే అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

విశాల్ నామినేష‌న్‌ ను ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై త‌మిళ‌నాట మొత్తం నిర‌స‌న‌తో పాటు.. ప్ర‌జాగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఇదిలా ఉంటే త‌న నామినేష‌న్ చెల్ల‌దంటూ ప్ర‌క‌ట‌న‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఈసీ ముందుకు ప్ర‌వేశ‌పెట్టాలంటూ మీడియా ద్వారా తాను స‌మాచారం అందుకున్న‌ట్లుగా విశాల్ ట్వీట్ చేశారు.

త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తూ సంత‌కం చేసి..ఆ త‌ర్వాత ఫోర్జ‌రీ అంటూ వ్యాఖ్యానించిన ఇద్ద‌రు మ‌ద్ద‌తుదారుల్ని తీసుకొని ఎన్నిక‌ల సంఘం అధికారుల వ‌ద్ద‌కు రావాల‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు చెప్పారన్నారు. అయితే.. త‌న‌కు కేవ‌లం రెండు గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చార‌న్నారు. ప్ర‌జాస్వామ్యం మ‌ళ్లీ త‌లెత్తుకు నిల‌బ‌డుతుంద‌ని తాను ఎదురుచూస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఆరాచ‌కం నుంచి భ‌గ‌వంతుడు నా దేశాన్ని కాపాడుతాడ‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని పేర్కొన్నారు. ఇన్ని వివాదాల అనంత‌రం ఎన్నిక‌ల అధికారులు ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏమైనా.. పందెం కోడికి ఎన్నిక‌ల సంఘం నుంచి మ‌రెన్ని ప‌రీక్ష‌లు ఎదుర‌వుతాయో..?
Tags:    

Similar News