సమోసా రూ.10..కండువా రూ.20

Update: 2020-11-21 01:30 GMT
గ్రేటర్ ఎన్నికల వేళ ఎన్నికల ఖర్చుల మీద క్లారిటీ ఇచ్చింది ఎన్నికల సంఘం. పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చు పరిమితి ఎంతన్న విషయం మీద ఇప్పటికే స్పష్టత ఉన్నప్పటికీ..దేనికి ఎంతన్న విషయాన్ని వివరంగా వెల్లడించారు. నాలుగు ఇడ్లీలకు రూ.20.. నాలుగు వడలకురూ.20.. ఆలు సమోసా ఒక్కొక్కటి రూ.10.. ఇరానీ సమోసా అయితే రూ3 చొప్పున ఖర్చును లెక్క వేయనున్నారు.

గ్రేటర్ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసే ఖర్చు వివరాల్ని అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పరిమితికి లోబడి ఖర్చు చేయాల్సి ఉంటుంది. పార్టీ కండువాకు రూ.20 చొప్పున ఖర్చును లెక్క కడతారు. అదే సమయంలో ఒక్కో మాస్కుకు రూ.20 చొప్పున అభ్యర్థుల ఖాతాలో నమోదు కానుంది. ఒక అభ్యర్థి రూ.5లక్షల లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కార్యకర్తలకు ఇచ్చే టీ.. కాఫీ ఒక్కొక్క దానికి రూ.5 నుంచి రూ.10.. నీళ్ల పాకెట్ రూ.1.. హాఫ్ లీటర్ అయితే రూ.10.. లీటరు అయితే రూ.20 చొప్పున ఖర్చు లెక్కిస్తారు. ఇండికా కారుకు డ్రైవర్ బత్తాతో కలుపుకొని రూ.1200.. ఎనిమిది నుంచి పదహారు మంది కూర్చునే మ్యాక్సీ క్యాబ్ లకు రోజుకు రూ.1700 చొప్పున ఖర్చు లెక్కిస్తారు. ఆటోకు రూ.350.. మినీ లారీకి రూ.1700.. బస్సుకు రూ.3900 చొప్పున ధరలు ఖరారు చేశారు. క్లాత్ తో తయారు చేసిన చిన్న జెండాల ధరను రూ.30గా.. పెద్దవైతే రూ.61 చొప్పున లెక్కించనున్నారు. ఐదుగురు కూర్చునే వేదిక (12 అడుగుల పొడవు.. అంతే వెడల్పు ఉండే లెక్కన) ఖర్చు కింద రూ.2200 లెక్క వేయనున్నారు. చికెన్ బిర్యానీ రూ.150.. మటన్ బిర్యానీ రూ.160 చొప్పున ఫిక్స్ చేశారు. వెజ్ బిర్యానీ రూ.100 ఖర్చులోకి తీసుకోనున్నారు.
Tags:    

Similar News