ఎన్నికల సమయంలో వివిధ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలను తాము నియంత్రించలేమని భారత ఎన్నికల కమీషన్ చేతులెత్తేసింది. పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఒక పిటీషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. దీనికి స్పందనగా ఎన్నికల కమీషన్ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో పార్టీలిచ్చే ఉచిత హామీలను తాము నియంత్రించలేమని స్పష్టంగా చెప్పేసింది.
ఎన్నికలకు ముందు లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను నియంత్రించటం సాధ్యం కాదని చెప్పేసింది. నియంత్రణకు వీలుగా ప్రత్యేక చట్టమేది లేదని కమీషన్ చెప్పింది. ఉచిత పథకాలను నియంత్రించటం సాధ్యంకాదని, ఆ హామీలు, పథకాలు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులపై ప్రభావం చూపుతున్నా తాము చేయగలిగిందేమీ లేదని కమీషన్ స్పష్టంచేసింది.
ఉచిత పథకాలపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాల ఓటర్లే కానీ తాము కాదన్నది. ఉచిత హామీలను నియంత్రించే అధికారాలేవీ కమీషన్ కు లేవన్నది. చట్టంలో ఎలాంటి మార్పులు చేయకుండా తమను నియంత్రించమంటే చట్టం పరిధి దాటి వ్యవహరించటం అవుతుందని కమీషన్ చెప్పింది. అయితే ఉచిత హామీలను నియంత్రించటంలో చట్టంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి కేంద్రప్రభుత్వానికి ఇప్పటికే ఒక లేఖ రాసినట్లు తెలిపింది.
2016లోనే దాదాపు 46 ప్రతిపాదనలు పంపినా కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా చెప్పింది. నిజానికి వివిధ పార్టీలిస్తున్న ఉచిత హామీల వల్ల, వాటి అమలు వల్ల రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు గుల్లయిపోతున్నాయి. తామే మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఏకైక టార్గెట్ గా పార్టీలో బుర్రకు తోచిన ఉచిత హామీలను ఇచ్చేస్తున్నాయి.
దీనికి ఉదాహరణ తమిళనాడు, తెలంగాణా, ఏపీలో జరుగుతున్న వ్యవహారాలే. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులతో సంబంధం లేకుండా తెలంగాణలో, ఏపీలో ఇచ్చిన హామీల కారణంగా ఆర్ధిక పరిస్థితులు తల్లకిందులైపోతున్నది. చంద్రబాబునాయుడు దెబ్బకు సగం, జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మిగిలిన సగం ఆర్ధికంగా రాష్ట్రం గుల్లైపోయింది.