ఎన్నికల ప్రచారాలకు ఈసీ లక్ష్మణ రేఖ గీసింది. పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. విద్వేషాలు రెచ్చగొట్టినా - ప్రసంగాలు చేసినా - ఊరేగింపులు - పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు - ప్రచార ఖర్చులు తదితర అన్ని విషయాలను ప్రకటించింది. అవి ఏంటంటే...
* వ్యక్తిగతంగా - పార్టీ తరుపున కానీ కుల - మత - భాషా విద్వేషాలను రెచ్చగొట్టరాదు. కుల - మత ప్రాతిపదికన ఓట్లు అడగరాదు. ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు చేయకూడదు.
* ఓటు కోసం డబ్బు ఇవ్వడం - బెదిరించడం నిషేధం.
* అధికారిక పర్యటనలను ఎన్నికల పనిలో కలపకూడదు.
* పైలట్ కార్లు - బుగ్గ కార్లు ఉపయోగించొద్దు.
* శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులకు సహకరించాలి.
* ఎలక్షన్ స్లిప్పులు - ఓటరు చీటీలపై పార్టీ గుర్తు - అభ్యర్థి పేరు ఉండరాదు. ధృవీకరించిన పాసులు లేకుండా ఎవరు కూడా పోలింగ్ బూత్ ల్లోకి వెళ్లకూడదు.
* ఊరేగింపులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలి.
* ఎవరి దిష్టిబొమ్మలు - చిత్రపటాలను తగులపెట్టరాదు
* నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలు మాత్రమే అనుమతి ఇస్తారు. అభ్యర్థితో సహా కేవలం ఐదుగురు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
* ప్రచార వాహనానికి రిటర్నింగ్ అధికారి మందుస్తు అనుమతి తీసుకోవాలి. స్పష్టంగా కన్పించేలా అనుమతి పత్రాన్ని వాహనానికి అతికించాలి. మరో అభ్యర్థికి వాడకూడదు.
* విద్యా సంస్థలు - వారి మైదానాలు ప్రచారానికి వాడకూడదు.
* ప్రైవేట్ భూములు - భవనాల యజమానుల లిఖిత పూర్వక అనుమతి తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ కు అందించిన తర్వాతే గోడ పోస్టర్లు అతికించాలి.
* కరపత్రాలు - పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ పేరు - చిరునామా విధిగా ఉండాలి.
* దేవుళ్లు ఫొటోలు - అభ్యర్థి ఫొటోలతో డైరీలు - క్యాలెండర్లు ముద్రించొద్దు.
* ప్రార్థనా స్థలాలు - పాఠశాలలు - పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల లోపు కార్యాలయాలను ఏర్పాటు చేయరాదు. కార్యాలయంపై పార్టీ జెండాలను కట్టుకోవచ్చు.
* రాత్రి 10గంటల తర్వాత నుంచి ఉదయం 6గంటల వరకు మైకులు - లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయరాదు.
* ఏజెంట్ అదే పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి.
* ఎస్ ఎంఎస్ ల ద్వారా అభ్యంతకర ప్రచారం చేయకూడదు. అభ్యంతర మెసేజ్ లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.
* పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో ఒక టేబుల్ - రెండు కుర్చీలు - అభ్యర్థి పేరు - బ్యానర్ తో ఎన్నికల బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు.
* పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల లోపు ప్రచార నిషేధం. ఈ పరిధిలో మొబైల్ ఫోన్ వాడడం కానీ ఆయుధాలు కలిగి ఉండరాదు.
* పోలింగ్ రోజున ఓటర్లను తరలించడానికి అభ్యర్థులు ప్రైవేట్ వాహనాలు సమకూర్చడం నిషేధం. ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలి.
* ప్రభుత్వ ఖర్చులతో మీడియా ప్రకటనలు చేయరాదు.
* నిషేధాజ్ఞలు - ఆంక్షలు ఉన్న ప్రదేశాల్లో సభలు - సమావేశాలు నిర్వహించకూడదు.
* సభలు - సమావేశాలకు ఎవరైనా అటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పార్టీగా చర్య తీసుకోవడానికి వీలు లేదు.
* ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలి.