ఓటు ఉందా లేదా.. ఈసీ కొత్త యాప్

Update: 2019-03-09 10:12 GMT
వేలసంఖ్యలో ఓట్లు తొలగింపునకు గురవుతుండటంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 20లక్షలపైగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. కొందరి పేర్లు ఓటరు లిస్టులో ఉన్నా పొలింగ్ బూత్ లో మాత్రం వారి పేర్లు చూపించలేదు. దీంతో ఓటర్లు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. చివరకు ఎన్నికల సంఘం ఓటర్లను క్షమాపణ కోరే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సంఘం దారుణ వైఫల్యంతో ఓటర్లు నిరాశ చెందారు. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఓటర్లకు ఉపయుక్తంగా ఉండేలా ఓ యాప్ ను రూపొందింది. దీనిలో ఓటరు సంబంధించిన ప్రతీ సమాచారం అందుబాటులో ఉంచింది. స్మార్ ఫోన్ ఉన్నవారంతా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఓటరు లిస్టులో తమ పేరు ఉందో లేదో చెస్ చేసుకోవాలని కోరింది.

గూగూల్ ప్లే స్టోర్ నుంచి ‘ఓటరు హెల్ప్ లైన్’ యాప్ ను డౌన్ చేసుకొని వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఇందులో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోరల్ పై క్లిక్ చేసి ఓటరు పేరు - తండ్రి పేరు - వయస్సు - నియోజకవర్గం - జిల్లా వివరాలను నమోదు చేసినట్లయితే ఓటరుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చూపిస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్ లేనివారు మాత్రం టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది.

ఒకవేళ ఓటరు లిస్టుతో తమ పేరు కనిపించకుండాపోతే ఈ యాప్ లోనే ఓటు నమోదు కోసం ఫారం 6, తొలగింపునకు ఫారం 7, మార్పుల కోసం ఫారం 8ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ద్వారా ఓటర్లకు ఎప్పటికప్పుడు సందేశాలు అప్డేట్ అవుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఏయే స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.. ఏయే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయనే విషయాలను పొందుపరిచినట్లు తెలిపారు.

ఈ యాప్ ద్వారా ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఏదిఏమైనా ఎన్నికల సంఘం టెక్నాలజీతో ఓటర్లతో సమన్వయం చేసుకోవడం అభినందించాల్సిందే. ఈ యాప్ ద్వారా ఓటర్లకు భద్రత, ఎన్నికల్లో అవినీతిని రూపుమాపేలా ఎన్నికల సంఘం పూనుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది


Tags:    

Similar News