పీకే భయ్యా.. షర్మిలకు ఎన్నికల స్ట్రాటజీ చేస్తానని ఎందుకు చేయలేదో?!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురించి అందరికీ తెలిసిందే. తాను ఎంచుకున్న పార్టీలకు ఆయన వ్యూహాలు రచిస్తారు. అధికారంలోకి వస్తాయని.. ముందుగానే గ్రహించిన పార్టీలకు ఆయన పనులు చేసి పెడతారు. తర్వాత.. ఆయా పార్టీలు అధికారంలోకి రాగానే తన క్రెడిట్‌లో వేసుకుంటారు. ఏపీలోను, బిహార్‌లోను. పశ్చిమ బెంగాల్‌లోనూ.. పీకే చేసింది ఇదే. అయితే.. ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని.. కేసీఆర్ సర్కారును కూలగొడతానని.. పదే పదే చెబుతూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన ఏపీ సీఎం జగన్ సోదరి.. షర్మిల విషయంలో మాత్రం పీకే.. వెనక్కి తగ్గారనే ఆరోపణలు వస్తున్నాయి.
వాస్తవానికి షర్మిల.. ఆది నుంచి అనేక సందర్భాల్లో పీకే భయ్యా తన పార్టీకి వ్యూహాలు రచిస్తారని.. పార్టీ పుంజుకునేలా వ్యవహరిస్తారని.. చెప్పారు. తాను కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎన్నికల కన్సల్టెంట్‌గా ఆయనను చేస్తానని కూడా చెప్పారు. అంతేకాదు.. తన పార్టీకి పీకే ఖచ్చితంగా పనిచేస్తాడని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే.. పీకే మాత్రం షర్మిల పార్టీని కనీసం పట్టించుకోలేదు. అంతేకాదు. ఆమె ఎవరిపై అయితే.. ఎగస్పార్టీగా కాలు దువ్వుతోందో.. అదే అధికార పార్టీ టీఆర్వ ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు. అంతేకాదు.. ఆ పార్టీలో ఒప్పందం కూడా చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
దీంతో అసలు ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. షర్మిల పార్టీని పక్కన పెట్టి.. అధికార పార్టీకి సేవ చేయడం వెనుక చాలా మిస్టరీ ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి పీకే మీద ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం వెనుక పీకే ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆపార్టీ అధినేత, సీఎం జగన్‌కు పీకే కు మధ్య అవినాభావ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ తరఫున.. పీకే పగ్గాలు పుచ్చుకోకుండా.. వైసీపీ ఒత్తిడి తెచ్చిందని.. వైఎస్సార్ టీపికి ఏమీ చేయొద్దని.. కూడా పీకేకు హుకుం జారీ చేసిందని అంటున్నారు.
అంతేకాదు.. తమకు(వైసీపీ) తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు మధ్య మంచి రిలేషన్ కూడా ఉందని.. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాల కొనసాగింపునకు .. మేము కట్టుబడి ఉన్నామని.. వైసీపీ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ హైకమాండ్ నేరుగా పీకేని ఒప్పించారని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే పీకే.. టీఆర్ ఎస్ కు వ్యూహకర్తగా పనిచేస్తున్నారని.. అని షర్మిల పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ప్రస్తుతం అయితే.. వైఎస్సార్ టీపీకి ఇటు ప్రజల నుంచి అటు ఇతర నేతల నుంచి కూడా ఎలాంటి మద్దతు కూడా లేదని అంటున్నారు. ఒక్క వార్డు సభ్యుడు కూడా షర్మిల పార్టీకి మద్దతుగా ఉండే పరిస్థితిలేదని చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీకి మధ్య మాత్రమే పోరు జరిగే అవకాశం ఉందని.. ఈ పార్టీలే లైమ్ లైట్‌లో ఉన్నాయని.. షర్మిల పార్టీకి ఇంకా కార్యకర్తలు ఊడా లేరని.. చెబుతున్నారు. షర్మిల పార్టీలో ఉన్నది కేవలం.. సెక్యూరిటీ మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో ఫొటోలు.. వీడియోలు తీసి.. ఫేస్‌బుక్‌లో పెట్టేవాళ్లు కొందరు ఉన్నారని, వారు తప్ప.. ఆమె కు ఎవరూ కూడా తెలంగాణలో సహాయం చేసే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. దీంతో షర్మిల కేవలం మీడియా మీటింగులు పెట్టి ఏదో కేసీఆర్‌ని టార్గెట్ చేసుకుని.. పరుష పదాలతో విరుచుకుపడుతుండడం తప్ప.. ఏమీ లేదని చెబుతున్నారు.
అది కూడా అలా మాట్లాడకపోతే.. ఏమీ డియా కూడా చూపించే పరిస్థితి లేదని.. షర్మిల భావిస్తున్నట్టు మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక, ఈ వీడియోలనే యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్ చేస్తున్నారు. ఇంతకు మించి షర్మిల పార్టీలో ఎలాంటి ఊపు లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె కేవలం నగరాలు, పట్టణాల్లో కొందరికి మాత్రమే పరిచయం ఉన్నారని.. గ్రామాల్లో అదికూడా లేదని.. షర్మిల అంటే.. ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొందని.. అందుకే పీకే కూడా సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు.