ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను హస్తగతం చేసుకున్న ఎలన్ మస్క్ ప్రపంచాన్ని శాసిద్దామని అనుకున్నాడు. ఈ క్రమంలోనే సంస్కరణల బాట పట్టి అందులోని సగం మంది ఉద్యోగులను, ఉన్నతాధికారులను తొలగించాడు. అంతటితో ఆగకుండా రోజుకో కొత్త నిబంధన తీసుకొచ్చి ఇరిటేట్ చేస్తున్నారు. ట్విటర్ బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోపే ఎలన్ మస్క్ కు గట్టి షాక్ తగిలింది. ట్విట్టర్‌లోని టాప్ 100 ప్రకటనదారులలో సగం మందిని కోల్పోయినట్లు అధ్యయనం వెల్లడించింది.
అమెరికాలోని మీడియా మేటర్స్ ప్రకారం.. టాప్ -100 మంది ప్రకటనకర్తలలో 50 మంది 2020 నుండి ప్లాట్‌ఫారమ్‌పై దాదాపు $2 బిలియన్లు ఖర్చు చేశారు. 2022లోనే $750 మిలియన్లకు పైగా ప్రకటనల కోసం ఖర్చు చేశారు.
ఇంకా నవంబర్ 21 నాటికి ఈ ప్రకటనలను నిలిపివేసినట్లు తెలిసింది. వారితో పాటు మరో ఏడుగురు అదనపు ప్రకటనదారులు ట్విట్టర్‌లో తమ ప్రకటనలను దాదాపు తగ్గించుకుంటున్నారు. ఈ పరిణామం ఎలన్ మస్క్ కు గట్టి షాకింగ్ లా మారింది.. 2020 నుండి ఈ ఏడుగురు ప్రకటనదారులు ట్విట్టర్‌లో $255 మిలియన్లకు పైగా ఖర్చు చేశారు. 2022లో దాదాపు $118 మిలియన్లు కావడం గమనార్హం.
సామాజిక ప్లాట్‌ఫారమ్‌ల నుంచి యాడ్ వ్యయాన్ని నెమ్మదిగా తగ్గించేస్తున్నారు. అనేక పెద్ద కంపెనీలు వైదొలుగుతండడంతో ట్విటర్, ఫేస్ బుక్ లకు భారీగా నష్టం వాటిల్లుతోందని నివేదికలు చెబుతున్నాయి.
చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ ఇంక్., ఫోర్డ్ , చేవ్రొలెట్ వంటి కంపెనీలు ట్విట్టర్‌లో తమ ప్రకటనలను ఆపివేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ట్విటర్ కు భారీ నష్టం అని అధ్యయనంలో తేలింది.
ఈ ప్రకటనల నష్టాలతో కూడా ఎలన్ మస్క్ బ్రాండ్ వాల్యూ దెబ్బతింది. ట్విటర్ ను ఆయన చర్యలతో దెబ్బతీశారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి నిషేధిత ఖాతాలను ఏకపక్షంగా పునరుద్ధరించడం, కొన్ని ఖాతాలతో మర్యాదపూర్వకంగా.. పరస్పర చర్యలు చేయడం.. అస్పష్టమైన ధృవీకరణ వ్యవస్థను అమలు చేయడం వంటివి ప్రకటనదారులు దూరం కావడానికి కారణమైంది. తీవ్రవాదులు -స్కామర్లు బ్లూటిక్ కొనుగోలు చేసేలా మార్పులు చేయడం కూడా ప్రకటనదారులు ట్విటర్ నుంచి వైదొలిగేందుకు కారణంగా చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.