లక్షల కోట్లు ఉంటే సరిపోతుందా? తింగరగా ఆలోచించకుండా.. అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలాంటి నిర్ణయాలు తీసుకోవటం అందరికి సాధ్యం కాదు. అత్యుత్తమ స్థానాల్లో ఉండేవారు కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు మొదటికే మోసం తెచ్చేలా మారుస్తాయి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అపర కుబేరుడు ఎలన్ మస్క్ నిర్ణయాన్ని చూసినోళ్లు. లక్షల కోట్ల సంపద పొగేసిన ఆయనకు ట్విటర్ ను సొంతం చేసుకోవాలన్న ఆశ పుట్టటం.. దాన్ని తనదిగా చేసుకునే వరకు నిద్రపోని వైనం తెలిసిందే.
ఇటీవలే ట్విటర్ కు తాను అధినేతగా మారిన నేపథ్యంలో.. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు కోట్లాది మంది ఫాలో అయ్యే ట్విటర్ కు ఉన్న మరోశక్తి ఏమంటే.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పరిణామాలకు కేంద్రంగా ఉండటం. సరిగ్గా దీన్నే తన సరికొత్త ఆదాయ మార్గంగా మార్చుకోవాలన్న కక్కుర్తి ఎలాన్ మస్క్ లో కనిపిస్తోంది. ట్విటర్ ను 4400 కోట్ల డాలర్లకు సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు దాన్ని తనకు డబ్బులు తీసుకొచ్చేదిగా మార్చుకోవాలన్న తపన కనిపిస్తోంది.
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ట్విటర్ లో బ్లూ టిక్ (అధికారికంగా గుర్తించిన అకౌంట్) ఉన్న అకౌంట్ ఉన్న వారు నెలకు 20 డాలర్లు (మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.1650) చెల్లించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వచ్చిందన్న వెంటనే.. ఈ సోషల్ మీడియా అనుసరించే విలువల్లో మార్పులు వస్తాయన్న సందేహాలకు బలం చేకూరేలా తాజా నిర్ణయం ఉందని చెబుతున్నారు.
ఎలాన్ మస్క్ తీరు చూస్తుంటే.. ట్విటర్ ఇప్పటివరకు అనుసరించిన విధానాలకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. దానితో వచ్చే సమాచార ప్రమాణాలు కూడా క్షీణించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపే కార్యక్రమాన్ని చేపట్టి.. పెద్ద ఎత్తున విమర్శల్ని మూటగట్టుకుంటున్న ఆయన.. 20 డాలర్ల కక్కుర్తితో మరోసారి ఆయన నిర్ణయంపై అందరూ విరుచుకుపడుతున్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఉండాలని.. సమాచారాన్ని తక్షణమే ప్రపంచంతో పంచుకోవాలన్న ఆశయంతో మొదలైన ట్విటర్ ప్రయాణం.. ఎలాన్ మస్క్ చేతికి చిక్కిన తర్వాత.. ప్రతి విషయాన్ని డబ్బులు రాల్చే మనీ మెషీన్ గా ట్విటర్ ను మార్చనున్నారా? అన్న సందేహం కలుగుతోంది.
ప్రస్తుతం ట్విటర్ లో 130 కోట్లకు పైనే ఖాతాలు ఉండటం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు వాడే మొబైల్ యాప్ లలో ట్విటర్ ఆరో స్థానంలో ఉండటం చూస్తే.. దీని శక్తి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి ఫ్లాట్ ఫాంను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ట్విటర్ తో మరింత సంపదను పోగేయాలన్న ఆలోచనను తప్పు పడుతున్నారు. దీనికి తోడు ట్విటర్ ఉద్యగుల్లో పని ఒత్తిడిని అమాంతం పెంచేసి.. తాను చెప్పినట్లుగా బండ చాకిరి చేయకుంటే ఉద్యోగాలు పోతాయన్న భయాన్ని పుట్టించాడు.
తనకున్న మిగిలిన సంస్థల్లోని నమ్మకస్తుల్ని ట్విటర్ లోకి దించేసిన ఎలాన్ మస్క్.. దాని సోర్స్ కోడ్ తో సహా ట్విటర్ ను సమస్తంగా అర్థం చేసుకోవాలని.. ఆకళింపు చేసుకోవాలని ఆరాటపడుతున్ానరు. ఇదేం తప్పు కాదు కానీ.. రాత్రికి రాత్రి అన్ని విషయాల మీద పట్టు తెచ్చుకోవటం సాధ్యం కాదన్న చిన్న లాజిక్ ను ఆయన మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
కార్ల కంపెనీ నిపుణుడిగా ఉన్న తన బలాన్ని.. ట్విటర్ కంటెంట్ కథ గురించి తెలుసుకోవాలన్న ఆరాటం ఆయనకు లాభాన్ని తెచ్చి పెడుతుందా? నష్టాన్ని మిగులుస్తుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి. వచ్చీ రాగానే తన కత్తికి ఎంత పదను ఉంటుందో అర్థమయ్యేలా చేయటం కోసం ఎడా పెడా నిర్ణయాలు తీసుకోవటం.. కీలక ఉద్యోగులపై వేటు వేయటం లాంటి దుందుడుకు చర్యలు ఒకవైపు.. మరోవైపు గుర్తింపు పొందిన ఖాతాల మీద నెలవారీగా 20 డాలర్ల ఫీజు విధించటం చూస్తే..త్వరలోనే ట్విటర్ ఏదో ఒక దరికి చేరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.