10 శాతం ఉద్యోగులను తొలగిస్తాం..: ఎలెన్ మస్క్ అధికారక ప్రకటన

Update: 2022-06-22 09:30 GMT
ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎలెన్ మస్క్ కఠినంగానే ఉంటున్నారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. ఎవరేమి అనుకున్నా.. లేబర్ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాడు. ఇప్పటి వరకు తన సంస్థల్లోని ఉద్యోగుల తొలగింపుపై మీడియా వేదికగా మాత్రమే కథనాలు వచ్చాయి. కానీ తాజాగా ఎలెన్ మస్క్ ఓ సమావేశంలో బహిరంగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ఆర్థిక మాంధ్యం, సేవింగ్స్ అని కారణాలు చెబుతున్నాడు. అయితే కారణాలు ఏం చెబుతున్నా ఉద్యోగుల విషయంలో ఎలెన్ మస్క్ ప్రవర్తనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ కుభేరుడిగా పేరు తెచ్చుకున్న ఎలెన్ మస్క్ ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రవర్తన భిన్నంగా ఉంటోంది. ఇటీవల వర్క్ ఫ్రం హోం విషయంలోనూ టెస్లా ఉద్యోగులకు వార్నింగ్ తో కూడిన లేఖలు పంపించారు. కరోనా కారణంగా తాము కార్యాలయల్లో పనిచేయలేమని, వర్క్ ఫ్రం హోంకే ప్రిఫరెన్ష్ ఇస్తామని అన్నారు. దీంతో ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని లేదంటూ ఉద్యోగం మానేయండి.. అంటూ లేఖలు పంపించారు. ఈ లేఖలు అందుకున్న వారిలో కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉండడం విశేషం.

ఎలెన్ మస్క్ తీరుతో కొందరు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. స్పేస్ ఎక్స్ల లో పనిచేసే ఉద్యోగులు ఇన్నర్ గా చిట్ చాట్ చేసిన ఓ లేఖ బయటకొచ్చింది. ఈ విషయం కంపెనీ అధినేత  వద్దకు వెళ్లడంతో ఉద్యోగులపై మస్క్ మండిపడ్డాడు.

దీంతో ఇలా చిట్ చాట్ చేసిన వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఎలెన్ మస్క్ వ్యవహార శైలిని విమర్శించిన తీరు, ఉద్యోగులను తొలగించిన విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ తొలిసారిగా తెలిపింది. అయితే ఆ సమయంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారన్నది మాత్రం స్పష్టత లేదు.

ఇలాంటి కథనాలు వస్తున్న తరుణంలో తాజాగా ఎలెన్ మస్క్ బ్లూమ్ బర్గ్ నిర్వహించిన కతర్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గన్నారు. ఈ సందర్భంగా మస్క్ ప్రసంగించారు. రానున్న మూడు నెలల్లో టెస్లాకు చెందిన 10 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వీరిని తొలగించడం ద్వారా టెస్లాలో 3.5 శాతం జీత భత్యాలు తగ్గిపోనున్నట్లు ఎలెన్ మస్క్ అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా రాయిటర్స్ ఓ కథనం వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుంచి టెస్లాను బయటపడేసేందుకు ఎలెన్ మస్క్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ఇందులో భాగంగానే గత జూన్ నెలలో ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా వరస్ట్ గా ఉందని, అందుకే ఎలెన్ ఉద్యోగులను తొలగిస్తూ.. నియామకాలను చేపట్టడం లేదని తెలిపింది.
Tags:    

Similar News