వర్క్ ఫ్రం హోంకు నో చెప్పిన ఎలన్ మస్క్.. ఉద్యోగులకు హెచ్చరిక

Update: 2022-06-02 06:34 GMT
టెస్లా కంపెనీ అధినేత ఎలెన్ మస్క్ వ్యవహారం ఈమధ్య చర్చనీయాంశంగా మారుతోంది. ప్రపంచ కుభేరుడైన ఈయన తన కంపెనీ వ్యవహారాలను చక్కదిద్దడంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటాడని అంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగులకు మెయిల్ ద్వారా ఓ హెచ్చరిక పంపాడు. ఇలా పంపించిన మెసేజ్ లీక్ అయింది. దీంతో కొందరు ఎలెన్ మస్క్ పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. తక్కువ ఉద్యోగులతో ఎక్కువ పనిచేయించుకునే ఎలెన్ మస్క్ వర్క్ ఫ్రం హోం విషయంలో ఓ ఆర్డర్ వేశాడట. ఆ ఆర్డర్ పై టెస్లా ఉద్యోగులు వణికిపోతున్నారట..

కరోనా కారణంగా చాలా కంపెనీలు స్ట్రక్ అయిపోయాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు పంపాయి. దీంతో కొందరు సంతోషంగా.. మరికొందరు ఆర్థికభారంతో ఉద్యోగులు పనిచేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం ను క్యాన్సిల్ చేసేస్తున్నాయి.

ఇంటి వద్ద కాకుండా కార్యాలయాలకు రావాలని చెబుతున్నాయి. ముందుగా ఆప్షనల్ ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు ఆర్డర్ వేస్తున్నాయి. ఇంతకాలం ఇంటి వాతావరణంలో పనిచేసిన ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు అనగానే కాస్త వేరేగా ఫీలవుతున్నారు. ఈ తరుణంలో కొందరు తాము ఇంటి నుంచే పనిచేస్తామని రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు.

టెస్లా కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు తాను వర్క్ ఫ్రం హోం చేస్తామని చెప్పారు. అయితే ఈ విషయం కంపెనీ అధినేత ఎలెన్ మస్క్ వద్దకు చేరింది. దీంతో ఎలెన్ కోపోద్రోక్తుడయ్యాడు. ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు రావాల్సిందేనని ఆర్డర్ వేశారు. రాకపోతే కంపెనీ నుంచి తప్పుకోండి అని మెయిల్ ద్వారా మెసేజ్ పెట్టించారు.

అయితే ఓ మెయిల్ నుంచి లీక్ అయిన ఈ మెసేజ్ పై ఇప్పుడ చర్చనీయాంశంగా మారింది. వర్క్ ఫ్రం హోం చేయాలనుకునేవారు వారంలో కనీసం 40 గంటలు కార్యాలయంలో చేయాల్సిందేనని ఈ మెసేజ్లో పేర్కొన్నారు. ఆఫీస్  అంటే కార్యాలయమేనని, అదీ కూడా ప్రధాన కార్యాలయేనన్నారు. బ్రాంచీల్లో పనిచేస్తానంటే కుదరదని చెప్పారు.

ఎలెన్ మస్క్ వ్యవహరంపై గతంలోనే చాలా విమర్శలు వచ్చాయి.ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంపై కొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చైనాలోని షాంఘైలో లాక్ డౌన్ కారణంగా అక్కడున్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కానీ టెస్లా కంపెనీ మాత్రం తమ ఉద్యోగులతో వారానికి ఆరు రోజులు పనిచేయించడం.. నిత్యం 12 గంటలు కార్యాలయాలు ఉండేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. మరి దీనిపై ఎలెన్ మస్క్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News