ఎలన్ మస్క్ భారీ ఎదురుదెబ్బ.. పేలిన స్పేస్ ఎక్స్ రాకెట్

Update: 2022-07-12 14:37 GMT
ట్విట్టర్ ను కొంటానని చెప్పు ముందుకొచ్చి చివరకు డబ్బుల్లేక డీల్ క్యాన్సల్ చేసుకున్న ఎలన్ మస్క్ కష్టాలు మరింతగా ముదిరాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మస్క్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి.

తన స్పేస్ ఎక్స్ రాకెట్ ల ద్వారా అంతరిక్ష యాతరలు చేసే మస్క్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టెక్సాస్ లోని స్పేస్ ఎక్స్ కు చెందిన సూపర్ హెవీ బూస్టర్ పేలింది. ఈ పరిణామం ఎలన్ మస్క్ ను ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

అంగారక గ్రహంపై మనిషి మనుగడ సాగించేందుకు అనువైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా ఎలన్ మస్క్ పనిచేస్తున్నాడు. ఇందుకోసం సులభమైన అతి తక్కువ ఖర్చుతో మార్స్, చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టేలా రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్ లతో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నాడు. వాటిని ప్రయోగిస్తున్నాడు.

ఈ సంవత్సరం చివరి నాటికి భూ కక్షలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసిన 394 అడుగుల సూపర్ హెవీ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ 7 ప్రోటో టైప్ ను టెక్సాస్ లోని స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాలు జరిపే బోకా చికా ప్రాంతంలో టెస్ట్ నిర్వహించింది. ఈ ప్రయోగం జరిపే సమయంలో స్పేస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ ఒక్కసారిగా పేలి తునాతునకలైంది.

ఈ పేలుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేలిన 33 రాప్టార్ ఇంజిన్ లతో తయారు చేసిన రాకెట్ ఎందుకు పేలిందనే అంశంపై స్పష్ట రావాల్సి ఉంది.దీనిపై ఆరాతీస్తున్నారు.

ఇక రాకెట్ పేలుడు మంచిది కాదని.. ఈ పేలుడు నష్టాన్ని స్పేస్ ఎక్స్ టీం అంచనావేస్తోందని ట్వీట్ చేశాడు.


Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News