భార‌త్ లో చైనీయుల్ని జ‌ర్నీ చేయొద్ద‌న్న చైనా

Update: 2017-07-08 15:41 GMT
అంత‌ర్జాతీయ వేదికల మీద భార‌త్‌.. చైనా అధినేత‌లు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని.. త‌మ ప్ర‌సంగాల్లో ఒక‌రినొక‌రు  పొగిడేయ‌టం తెలిసిందే. ఈ ప‌రిణామం రెండు దేశాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సిక్కిం స‌రిహ‌ద్దుల్లో భార‌త్‌.. చైనాల‌కు మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం నేప‌థ్యంలో భార‌త్ లో ఉన్న చైనీయుల‌కు ఆ దేశం భ‌ద్ర‌తా ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు చెప్పుకొచ్చింది.

ఓప‌క్క అంత‌ర్జాతీయ వేదిక మీద ఇరు దేశాల నేత‌ల మ‌ధ్య స‌హృద్బావ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉన్నట్లుగా వ్య‌వ‌హ‌రించిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే చైనా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా ప్ర‌క‌ట‌న‌.. ఇప్పుడు కొత్త క‌ల‌క‌లాన్ని రేపుతోంది. ఇరు దేశాల అధినేత‌ల మ‌ధ్య షేక్ హ్యాండ్ లు బాగానే సాగిన‌ప్ప‌టికీ.. అందుకు భిన్నంగా భార‌త్ లో ఉండే చైనీయుల‌కు స‌రికొత్త సూచ‌న‌లు చేసింది.

వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త మీద దృష్టి పెట్టాల‌ని కోరింది. అన‌వ‌స‌ర ప్ర‌యాణాల్ని చేయొద్ద‌న్న చైనా.. ఇవ‌న్నీ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లుగా త‌మ దేశీయుల్ని కోరింది. ఇక‌.. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో స్థానిక పోలీసులు లేదంటే చైనా ఎంబ‌సీని ఆశ్ర‌యించాల‌ని కోరాల‌ని చెప్పింది. ఎప్పుడూ భ‌ద్ర‌తా ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరింది. బ‌య‌ట‌కు వెళ్లే వేళ‌లో చైనీయులు త‌మ గుర్తింపు కార్డుల్ని విధిగా ఉంచుకోవాల‌ని.. కుటుంబ స‌భ్యులు ఎప్ప‌టిక‌ప్పుడు తాము ఎక్క‌డికి వెళుతున్న విష‌యాన్ని పంచుకోవాల‌ని కోర‌టం గ‌మ‌నార్హం. సిక్కిం స‌రిహ‌ద్దుల్లోని డోక్లాం విష‌యంలో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకోవ‌టం తెలిసిందే.
Tags:    

Similar News