మోడీ.. బాబు అమ్మ మొగుడు ఆ దేశాధ్య‌క్షుడ‌ట‌

Update: 2017-08-27 13:48 GMT
అదేదో దేశాధ్య‌క్షుడి సంగ‌తి చెబుతూ.. మ‌న ప్ర‌ధాని మోడీని.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును సీన్లోకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఏమైనా ఉందా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. విష‌యం మొత్తం విన్నాక నిజ‌మే అనుకోక త‌ప్ప‌దు. ఫ్రాన్స్ దేశాధ్యోఉడు మేక్రాన్ ఇమ్మాన్యుయేల్ కు సంబంధించిన ఒక చిత్ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి ఆ దేశ‌స్తుల్ని మాత్ర‌మే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురిని షాక్‌ కు గురి చేస్తోంది.

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మేక్రాన్ అందం మామూలు కాదు. అంత పెద్ద ట్రంప్ కుమార్తె కూడా ఆయ‌న అందాన్ని మెచ్చుకోవ‌టం ఆ మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ రేపింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స‌ద‌రు దేశాధ్య‌క్షుడి ల‌వ్ స్టోరీ.. త‌న‌కంటే పాతికేళ్ల పెద్ద‌దైన త‌న చిన్న‌నాటి టీచ‌ర్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవ‌టం వింత‌గా.. విచిత్రంగా చెప్పుకుంటూ ఉంటారు. రాజ‌కీయాల్లో అంచ‌లంచెలుగా ఎదిగిన మేక్రాన్ ఫ్రాన్స్ దేశ‌స్తుల అభిమానంతో దేశాధ్య‌క్షుడుగా ఈ మ‌ధ్య‌నే బాధ్య‌త‌లు స్వీక‌రించారు కూడా.

ఇదంతా ఒక ఎత్తు అయితే..తాజాగా ఆయ‌న‌కు సంబంధించిన ఒక షాకింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అందంగా క‌నిపించ‌టం కోసం మేక్రాన్ వేసుకునేందుకు ఆయ‌న ఖ‌ర్చు చేసే మేక‌ప్ ఖ‌రీదు విన్న వెంట‌నే నోట మాట రాని ప‌రిస్థితి. ఫ్రాన్స్ అధ్య‌క్షుడిగా ఎంపికైన తొలి వంద రోజుల్లో మేక‌ప్ కోసం ఆయ‌న ఏకంగా 26వేల యూరోలు ఖ‌ర్చు చేశార‌ట‌. మ‌న రూపాయిల్లో చెప్పాలంటే అటూఇటూగా రూ.19 ల‌క్ష‌ల‌ట‌. వంద రోజుల‌కు రూ.19 ల‌క్ష‌లంటే రోజుకు ఎంతో లెక్కేస్తే.. ఆయ‌న ఒక‌రోజు మేక‌ప్ ఖ‌ర్చుతో ఒక కుటుంబం నెల రోజుల పాటు ఆనందంగా బ‌తికేసే ప‌రిస్థితి.  తాజాగా విడుద‌లైన ఒక నివేదిక ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఇందులో ఇటీవ‌ల కాలంలో మేక్రాన్ పాపులారిటీ త‌గ్గుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు సంబంధించిన ఈ త‌ర‌హా అంశాలు బ‌య‌ట‌కు రావ‌టంతో ఆయ‌న‌పై ప‌లువురు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్ దేశాధ్య‌క్షుడి ఖ‌ర్చు చూస్తే.. మోడీ.. బాబులు కూడా తేలిపోతార‌నే చెప్పాలి.

ప‌దేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కోసం ల‌క్ష‌లాది రూపాయిల్ని ఖ‌ర్చు చేయ‌టం.. చివ‌ర‌కూ ప‌ది రోజులుకూడా ఆయ‌న  అందులో ఉండ‌ని ప‌రిస్థితి. ఇదే తీరులో హైద‌రాబాద్ లోని ఇంటి కోసం.. తాత్కాలిక స‌చివాల‌యం పేరుతో ఆయ‌న చేసిన ఖ‌ర్చుపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన ప‌రిస్థితి. ఇదే రీతిలో ప్ర‌ధాని మోడీ తాను ధ‌రించే కోటు మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వీటికి మించిన‌ట్లుగా మేక‌ప్ కోస‌మే భారీగా ఖ‌ర్చు చేసిన దేశాధ్య‌క్షుడి ఉదంతం వింటే మాట రాని ప‌రిస్థితి.
Tags:    

Similar News