ఐటీ సెక్టార్లో ఉద్యోగాలకు కోత పడుతన్న వేళ నాస్కామ్ మాత్రం అలాంటి భయాలు పెట్టుకోవద్దంటోంది. కొత్త నైపుణ్యాలు పెంచుకుని, ఉన్న నైపుణ్యాలకు సాన పెట్టుకుంటేనే నిలదొక్కుకోగలుగుతారని అంటోంది. ఈ ఏడాది ఐటి పరిశ్రమలో మూకుమ్మడి లేఆఫ్‌లు ఏవీ ఉండవని.. నాలుగో క్వార్టర్లో కేవలం అయిదు సంస్థలే నికరంగా 50 వేల మందిని కొత్తగా హైర్ చేసుకున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ అంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు అప్ డేట్ కాకపోతే పతనం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఏడాదికి 1.5 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న ఐటి పరిశ్రమ నికరంగా కొత్త ఉద్యోగుల నియామకాలు చేపడుతుందని చంద్రశేఖర్ భరోసా ఇస్తున్నారు. పరిశ్రమలో భారీగా ఉద్యోగాల కోతలుంటాయంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చుతూ ఉద్యోగుల పనితీరుపై వచ్చే నివేదికల ఆధారంగా సిబ్బందిలో సర్దుబాట్లు చేయడం ప్రతి సంవత్సరం ఉంటుందన్నారు.
అయితే... నాస్కామ్ చెప్తున్నట్లు పరిస్థితులు అంత బాగుంటే ఐటీ ఉద్యోగులలో ఈ ఆందోళనలు ఎందుకనే విషయంలో మాత్రం ఆ సంస్థ క్లారిటీ ఇవ్వడం లేదు. పలు సంస్థల్లో భారీ ఎత్తున ఉద్యోగాలకు కోత పెడుతుండడం వల్లే ఈ ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయన్న సంగతి తెలిసిందే. నైపుణ్యాలతో సంబంధం లేకుండా ఉద్యోగాలకు కోత పడుతోందని ఐటీ నిపుణులు కొందరు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/