ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఇప్పట్లో పీఆర్సీ ఉండదని.. పరోక్షంగా చెప్పేసింది. ఎందుకంటే పీఆర్సీ గడువును డిసెంబర్ వరకు పొడిగించడంతో ఇప్పటికిప్పుడే ఉద్యోగులకు పీఆర్సీ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు పీఆర్సీ వేస్తే జీతాలు పెరుగుతాయని ఆశించిన ఉద్యోగుల్లో తాజాగా పొడిగింపుతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే పీఆర్సీ వేయక రెండేళ్లు గడిచిపోయింది. రెండేళ్లుగా ఇవాళ.. రేపు అంటూ సాగదీసి చివరకు డిసెంబర్ వరకు పొడిగించడంతో ప్రభుత్వ ఉద్యోగ - ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ నివేదికను డిసెంబర్ వరకు పొడిగించింది. ఈ పొడిగింపుతో ఉద్యోగులకు పీఆర్సీ లేకపోవడంతో ఇప్పట్లో జీతాల పెంపు ఉండదు. అయితే 2018 నుంచి పీఆర్సీ ప్రకటించలేదు. 2018 జులై నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ నివేదికను ఇప్పటివరకు పొడిగించారు. మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియను 30 నెలలకు పొడిగించడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ - ఐఆర్ పై ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చి రెండేళ్లు దాటింది. ఇంకా ఇప్పటివరకు ప్రకటించకుండా నాన్చుతూ.. కాలయాపన చేస్తూ తీరా రెండేళ్లయ్యాక.. ఇంకా మరో 8 నెలలు పీఆర్సీ నివేదికను పొడిగించడం ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురి చేసింది.
ఈ నిర్ణయంతో నిరాశకు గురయిన ప్రభుత్వ ఉద్యోగులు - ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన తమను కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అదే క్రమంలోనే ఇటీవల రెవెన్యూ ఉద్యోగులపై కేసీఆర్ మండిపడ్డారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు పీఆర్సీ కూడా ఇవ్వకుండా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. పీఆర్సీ వేయడానికి 30 నెలల సమయం కావాల్న అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో వాడుకుని ఇప్పుడు తమకు మొండిచేయి చూపడం సరికాదని పేర్కొంటున్నారు.
ఇన్నాళ్లు ఓపిక పట్టం ఇక చూస్తూ ఊరుకోమని ఇక ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ మేరకు శని - ఆదివారాల్లో ఉద్యోగ - ఉపాధ్యాయల సంఘాలు సమావేశమై చర్చించాయి. త్వరలోనే కేసీఆర్ కలిసి విన్నవించి - గడువు విధించాలని నిర్ణయించారు. ఆ గడువులోపు మధ్యంతర భృతి ప్రకటించకపోతే పోరుబాట పడతామని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. పీఆర్సీ ప్రకటించలేదు.. కనీసం మధ్యంతర భృతి ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ పంపారు. ఈ ఉద్యోగుల ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతునిచ్చే అవకాశం కనిపిస్తోంది.